‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో మెగా బ్రదర్….!

Nagababu Acted in ntr biopic
Share Icons:

హైదరాబాద్, 4 సెప్టెంబర్:

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం…సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంది. అయితే చిత్రబృందం ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని పాత్రల ఎంపికను చాలా జాగ్రత్తగా చేపడుతుండ‌గా, లీక్ అవుతున్న వార్త‌ల‌కి అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ సినిమాలో రోజుకో కొత్త పాత్ర గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

ఇప్పటికే అధికారికంగా ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తుండ‌గా శ్రీదేవిగా ర‌కుల్ ప్రీత్ సింగ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ ,మరో కీలక పాత్ర హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి, ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర‌లో రానా నటిస్తుండ‌గా, ఆయ‌న భార్య భువ‌నేశ్వ‌రి పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టి మంజిమో మోహ‌న్ న‌టిస్తున్న‌ట్టు ప్రకటించారు. అలాగే ఎన్టీఆర్ మరో తనయుడు హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్ నటిస్తున్నాడని తెలుస్తుంది.

ఇక తాజాగా మహానటుడు ఎస్వీ రంగారావు పాత్రలో మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు నటిస్తున్నాడు అని ప్ర‌చారం జ‌రుగుతుంది. నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలో మెగా బ్రదర్ చేర‌డంతో మూవీపై భారీ అంచనాలు పెరిగాయి.

మామాట: మొత్తానికి ‘ఎన్టీఆర్’లో స్టార్స్ అందరూ మెరవనున్నారు….

Leave a Reply