Header Banner
Header Banner
TRENDING NOW

జనసేన ఎంపీగా నాగబాబు?

జనసేన ఎంపీగా నాగబాబు?

హైదరాబాద్, మార్చి 14.

పవన్ సోదరుడు నాగబాబు జనసేన తరపున ఎంపీగా పోటీకి దిగనున్నారంటూ ఓ వార్త రాజకీయ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టినప్పుడు అన్నయ్యకు చేదోడువాదోడుగా ఉన్న నాగబాబు ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. అయితే తాజాగా తన అన్నయ్యను లోక్‌సభ ఎన్నికల్లో నిలబెట్టాలని పవన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల గుంటూరులో జనసైనికులతో సమావేశం నిర్వహించిన నాగబాబు తాను సాధారణ కార్యకర్తను మాత్రమేనని చెప్పారు.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD
Life Homepathy

అయితే గుంటూరు పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆయన ఈ సమావేశం నిర్వహించినట్లు కొందరు చెబుతున్నారు. పోటీకి నాగబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయన్ని లోక్‌సభ బరిలో దించేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారట. గుంటూరు లేదా నర్సాపురం నుంచి ఆయన్ని పోటీ చేయించాలని యోచిస్తున్నారు.

నాగబాబు ఎంపీగా పోటీచేస్తే దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మేలు చేస్తుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. మరి నాగబాబు పోటీకి సై అంటారో లేదో వేచి చూడాలి.

మామాట: మంచిదే.. బాలయ్య పోటీ చేయగా లేనిది నాగబాబు చేయలేడా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: