రాజకీయాలకేం గానీ… పరిపాలనేదీ?

Share Icons:

తిరుపతి, నవంబర్ 14,

రోజూ పత్రికలు, వార్తలు, రాజకీయాలు, పిల్లిమొగ్గలు తిట్ల వర్షాల గురించి చదివిందే చదువుకుంటూ ఉంటాం. మన జీవితాల్లో సినిమాలు, రాజకీయాలు తి ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి.

అయితే, బుధవారం ఈనాడు పత్రికలో .. లోపల పేజీలో వచ్చిన ఒక వార్త మనం ఆలోచించవలసినది. అదే మంటే ప్రమాదపు పానుపు…ఆదవరచి పవళింపు… అనేది. 6 పేజీలో ఉంది… మనపాలకులు సిగ్గుతో తలవంచుకుని రాజకీయాలనుంచి తప్పుకుని, సన్యాసం తీసుకోవాలి. మనకెందుకండీ బుల్లెట్ రైళ్లు, జిల్లాకో విమానాశ్రయం. ప్రభుత్వా సుపత్రులను సక్రమంగా నిర్వహించలేని పాలకులు ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపుతున్నారు. మళ్లీ మళ్లీ తమనే ఎన్నుకోమని భ్రమలు కల్పిస్తున్నారు.

ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నవారి సహాయకులు పాపం, మరెక్కడా స్థలం లేకుండా నడి రోడ్డుపై ఉండే డివైడర్ ను పానుపుగా భావించి రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నారు. అసలే చలికాలం, పలురోగాలు రావడానికి ఆస్కారం ఉన్న కాలం, అందునా రోడ్డు, అక్కడ పరిశ్రుభ్రత ఆశించలేం. మరి పాలకులు మాత్రం బహుళ గదులు భవనాలలో పట్టు పానుపులపై నిద్రిస్తున్నారు. సదరు గుంటూరు ప్రాంతానికి చెందిన శాసన సభ్యుడు ఈ దృశ్యాన్ని చూసి సిగ్గుపడవలసిన అవసరం లేదా.  మరి ఇతర ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు. ఎంపీ గారి నిధులు ఎక్కడికి పోతున్నాయి.  ఆ ప్రజాధనంతో వారు చేస్తున్న మంచి పనులు ఏమిటో సమీక్షించాల్సి ఉంది.

ఆ మాత్రం మౌళిక వసతి కల్పించలేని ప్రభుత్వాలు ఎందుకు. ప్రజా ప్రదినిధులు ఎందుకు. ఎన్ని నిధులు, ఎంత సిబ్బంది, మరెన్ని ప్రంచవర్ష ప్రణాళికలు మంటగలిసిపోయాయో… కదా…. పాలకుల తీరు మారకుండా ఇటువంటి పరిస్థితులు మారవు. అందుకు ప్రజలు ముందుగా మారాలి, తమను తాము ప్రశ్నించుకుని, ఇంత స్వార్థపరులను గెలిపించిన తీరుకు వారుకూడా సిగ్గుపడి, వచ్చే ఎన్నికల్లో అయినా, కనీసం విజ్ఞతతో ఓటు వేయడానికి సిద్దంకావలసిన తరుణం ఇదే.

స్వతంత్ర్యం వచ్చిన 76 సంవత్సరాల అనంతరం కూడా, పేదలు కనీస వైద్య సౌకర్యాలకు ఇంతగా ఇబ్బదిపడుతున్న సంఘటన మరే దేశంలోనూ ఉండదేమో. ప్రతిదానిపైనా పన్నులపై పన్నులు పీడించి వసూలు చేస్తున్న ప్రజాధనం ఏమౌతోంది.  ఎందుకు పాలకులకు ఇంత నిర్లక్షం. ప్రజలను మనుషులుగా కాకుంటా ఓటర్లుగా మాత్రమే చూచే తత్వం కారణంగా వారికి ప్రజల పట్ల నిబద్దత పోయింది. ఎన్నికల ముందు  కులాల వారిగా, వర్గాల వారిగా తాయిలాలు పంచితే చాలు గెలుస్తాం. బూత్ మేనేజేమెంట్ తెలిస్తే చాలు గెలిచిపోతానే నమ్మకమే పాలకపక్షాలకు పట్టుగొమ్మ. ప్రజల్లో మార్పు రాకుండా  పరిస్థితిలో మార్పు రాదు.

మామాట : పరిపాలనలో ఇన్ని లొసుగులు పెట్టుకుని ప్రజస్వామ్యానికి ప్రమాదమంటున్నారు ముఖ్యమంత్రి.

Leave a Reply