TRENDING NOW

విలక్షణ వ్యక్తిత్వం

 

తిరుపతి, నవంబర్ 06,

వర్తమాన రాజకీయ వైనాలు, నేతల తీరు తెన్నులు పరిశీలించడం నడుస్తున్న వైనాలలో కనిపించే వైనం.  మంగళవారం (06.11.18) దిన పత్రికలలో ఆకర్షించే వార్త.. సాక్షి పత్రికలోని పతాక శీర్షిక…  ఒక్క మాట కోసం తలవంచని ధీరుడు  అన్నది.

భారత దేశానికి స్వతంత్ర్యం వచ్చిన తొలి రెండు దశాబ్ధాలలోనే మన దేశ రాజకీయాల ముఖచిత్రం దారుణంగా మారిపోయింది. నిజానికి 1947 కు ముందు కూడా మన దేశంలో భారీ రాజకీయాలుండేవి కానీ అవి సిద్దాంతాలకు సంబంధించినవి.  వాటి పునాదులమీద వర్తమాన రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది కాదన లేని సత్యం. నెహ్రూ కాలంలోనే పతనం మొదలైందని ఈతరం గుర్తుపెట్టుకుంటే మంచిది.

ఇక వర్తమాన విషయం. ఆంధ్రప్రదేశే లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పాలన ఒక సంచలనం. దాదాపు రాజకీయ జీవితం అంతా ప్రతిపక్షంలో గడిపిన వైయస్ ఆర్, ఒక్క సారిగా ఎదురులేని బలంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతే అకస్మాత్తుగా అధికార యవనిక పైనుంచి.. అంతర్ధానమై, తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారు. అది కేవలం ఆయన కుటుంబానికి, పార్టీకి మాత్రమే కాక రాష్ట్రానికి కూడా షాక్. అందులోనుండి తేరుకునే లోగానే ఆయన తనయుడు వైయస్ జగన్ తెరపైకి రావడం అన్నది మరో సంచలనం. తండ్రి ఆకస్మిక మరణంతో జగన్ సీఎం పదవిని ఆశించారు.  అది లభించలేదు. పైగా ఢిల్లీ పెద్దలనుంచి కేసుల రూపంలో వేధింపులు మొదలయ్యాయి. దీనితో జగన్ ఎదురు తిరిగారు. కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టి స్వంతంగా పార్టీ పెట్టుకున్నారు. తొలి దశలో ఎలా ఉన్నా, 2014లో ఏపీ విభజన తరుణంలో జరిగిన ఎన్నికల్లో జగన్ పార్టీ ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేదు. ఆ తరువాత కూడా పాలక పక్షం విసిరిన రాజకీయ సవాళ్లను  పార్టీ ధీటుగా ఎదుర్కోలేదు. జగన్ రాజకీయ అనుభవ లేమి పలుమార్లు బూమరాంగయ్యింది.

కానీ, చిన్నవయసులో స్వంతంగా పార్టీ పెట్టిన జగన్ గత తొమ్మిది సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్న తీరు ఆశ్చర్యకరం. ఒక రాజకీయ పార్టీని.. అందునా అధికారం లేని సమయంలో కొనసాగించడం చాలా కష్టం. అదలా ఉంచితే.. గత ఏడాదిగా ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి స్వయంగా రోడ్డున పడి సుమారు 3,211 కిలో మీటర్ల యాత్ర పూర్తిచేయడం అపూర్వం. విభజన నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో అనేక హామీల నిచ్చి పదవి దక్కించుకున్న చంద్రబాబు అండ్ కో చేస్తున్న నిర్వాకాలను జగన్ ఊరూ వాడా నినదిస్తున్నారు. నేరుగా ప్రజలతో మాట్లాడుతున్నారు. వారి కష్టాల కొలిమి లాంటి దైనందిన జీవితచిత్రాన్ని స్వయంగా తిలకిస్తున్నారు. ప్రజలతో మమేకమై… పాదయాత్రలో సంలీనమవుతున్నారు. వేలాది గ్రామాలు ఏడాదిగా తిరుగుతున్నారు.  ఈ పోరాట పటిమ వర్తమాన రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. మెగాస్టార్ వంటి వారు కూడా పార్టి పెట్టి అధికారం రాలేదనగానే.. లెక్కలు చూసుకుని, చిట్టాలలో నష్టాలు గుర్తించి, వెంటనే పార్టీ కార్యాలయం తలుపులు మూసేసుకున్నారు. మరో పార్టీలో కలిపేసి, పదవేది తాను అందుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం తొమ్మిది సంవత్సరాలు పొరాడుతూనే ఉన్నారు. తన తండ్రిని ఆదరించిన పేద, బడుగు, బలహీనవర్గాలకోసం తాను కూడా స్పంధిస్తున్నారు. ఎండ వాన లెక్కచేయకుండా దారివెంట, చెట్టుకింది శ్రామిక, కర్షకజన సమేతంగా ముందుకు సాగుతున్నారు…

మామాట:  నడక శారీరిక ఆరోగ్యానికే కాదు సమాజానికి కూడా హితకారిణి కానుందా!…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: