డబ్బున్నవారికి దాసోహం

Share Icons:
 
తిరుపతి, అక్టోబరు 11,  
ఇపుడు రాజకీయాలు డబ్బుతో వ్యవహారంగా మారిన విషయం తెలిసిందే.  ముఖ్యంగా తెలుగుదేశం నేత చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత బడా పారిశ్రామిక వేత్తలను. ధనవంతులను పార్టీతరపున రాజ్యసభకు పంపడం  ఆనవాయితీగా మారింది. అంతకు ముందు రామారావు హయాంలో ఇలా ఉండేది కాదు.  అనేక మార్గాల్లో వందల కోట్లు గడించినవారు పార్టీనిర్వహణకు పెట్టుబడి పెట్టడం, తరువాత నాయకులుగా ఎదగడం జరుగుతోంది. ఇదివరకు పార్లమెంటుకు ఎన్నిక కావడానికి ఈ విధానం అమలులో ఉండగా తాజాగా టెండ్ మారింది. ఒకప్పుడు ఎంపీ అంటే ఎంతో గౌరవం. రాజకీయాల్లో తల పండిన వాళ్ళను అత్యున్నత పార్లమెంట్ కి పంపేవారు. మేధావులు అనుకునే వారిని రాజ్యసభకు ఎంపిక చేసేవారు.
ఇపుడు రోజులు మారిపోయాయి. ఎవరి దగ్గర దండీగా దబ్బు ఉంటే వాళ్ళే పార్లమెంట్ కు రెడీ అయిపోతున్నారు. అందుకోసం పార్టీలు కూడా వేట మొదలుపెడుతున్నాయి. ఆ సెర్చింగ్ లో జనానికి కాస్త ముఖ పరిచయం కలిగిన వాళ్ళు, రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు దొరికితే అంతకంటే అదృష్టం లేదు.ఉత్తరాంధ్ర విషయానికి వస్తే అన్ని రాజకీయ పార్టీలది ఒకటే బాధ. ఎంపీ టికెట్లకు ఎవరు పోటీదారులు అన్నది. ఇది ముడి విప్పలేని పెద్ద చిక్కు ప్రశ్నగా అయిపోతోంది. లోక్ సభకు పోటీ అంటే ఏడు అసెంబ్లీ సీట్లను కవర్ చేయాలి. జంట ఎన్నికలు పెడితే ఆయా ఎమ్మెల్యేల ఖర్చు కూడా తన పద్దులోనే రాయాలి. తీరా వారు తమ కోసం మాత్రమే ప్రచారం చేసుకుని ఎంపీ క్యాండిడేట్ ని గాలిలోకి వదిలిపెట్టిన సంఘటనలు కోకొల్లలు. దాంతో ఎంత డబ్బు పెట్టినా ఎమ్మెల్యే క్యాండిడేట్లను నమ్మలేని స్థితి. దాంతో ఎందుకొచ్చిన తల నొప్పి, హ్యాపీగా ఎమ్మెల్యేకే పోటీ చేయడం సుఖం అని అనుకుంటున్నారు. దాంతో అన్ని పార్టీలదీ ఒకటే గోల. ఎంపీ క్యాండిడేట్లేరీ అని.
విశాఖ ఎంపీ సీటుకు వైసీపీ తరఫున ఎంవీవీ సత్యనారాయణ దాదాపు ఖరారేనని అంటున్నారు. జగన్ ఆయనను ఆ మధ్య పార్టీలో చేర్చుకుని వెంటనే విశాఖ పార్లమెంట్ ఇంచార్జ్ గా డిక్లేర్ చేశారు. సినీ నిర్మాతగా కొన్ని మూవీస్ తీసిన సత్యనారాయణ విశాఖ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి. జనాలతో పెద్దగా సంబంధాలు లేకపోయినా డబ్బు ఖర్చు బాగా చేయగలరన్న ఒకే ఒక కారణం చేత ఆయన్ని ఎంపీ అభ్యర్ధిగా నిర్ణయించేశారని టాక్. ఇక టీడీపీలో చూసుకుంటే ఇటీవల మరణించిన ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రి భరత్ పేరు వినిపిస్తోంది. . సెంటిమెంట్ తో కొట్టడంతో పాటు బాలయ్య అల్లుడు అన్న ట్యాగ్ ని కూడా వాడేసుకోవాలని సైకిల్ పార్టీ డిసైడ్ అయింది.ఇక అనకాపల్లి లోక్ స‌భకు టీడీపీ సిట్టింగ్ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ ఈసారి పోటీ చేయనని అంటున్నారు. దాంతో అక్కడ ఎవర్ని పెడతారో చూడాలి. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో పాటు అనేక పేర్లు ఉన్నా చాలా మంది మాత్రం అసెంబ్లీకే మొగ్గు చూపిస్తున్నారు. వైసీపీ విషయానికి వస్తే వరుడు కళ్యాణిని ఇంచార్జ్ గా పెట్టారు. ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. చివరి నిముషంలో మారుస్తారని అంటున్నారు. వైసీపీకి ఇక్కడ సరైన క్యాండిడేట్ లేరనే చెప్పాలి.అరకు లోక్ సభ సీటు కూడా అలాగే ఉంది. ఇక్కడ కురుపాం ఎమ్మెల్యే భర్త పరీక్షిత్ రాజుని వైసీపీ ఇంచార్జ్ గా పెట్టారు. ఆయన పేరే ఖరారని అంటున్నారు. కానీ గట్టి క్యాండిడేట్ కాదని వినిపిస్తోంది. వేరే వాళ్ళను ట్రై చేస్తున్నా నో అంటున్నారుట. టీడీపీలోనూ అంతే పరిస్థితి.
ఈ మధ్యనే మావోలు కిడారి సర్వేశ్వరరావుని, మాజీ ఎమ్మెల్యే సోమలను దారుణంగా హత్య చేయడంతో పోటీకి ఎవరూ ముందుకు రావడం లేదు.ఇక్కడ వైసీపీతో పోలిస్తే టీడీపీకి ఎంపీ క్యాండిడేట్లు కొంత మెరుగ్గా ఉన్నారు. శ్రీకాకుళం నుంచి మళ్ళీ సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు ని నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీకి ఏ పేరూ పరిశీలనలో లేదు. విజయనగరం నుంచి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మరో మారు రెడీ అంటున్నారు. . ఇక్కడా వైసీపీకి పోటీకి బలమైన క్యాండిడేట్లు లేరు. మొత్తానికి చూసుకుంటే ఎంపీ సీట్ల అభ్యర్ధుల ఎంపిక చాలా కష్టంగా ప్రధాన పార్టీలకు ఉంది.
మామాట : పార్టీలు పెట్టింది అధికారంలోకి రావడానికి కానీ, సమాజ సేవచేయడానికి కాదు కదా..

Leave a Reply