నరేంద్ర మోది-రాఫెల్-ఓ మచ్చ

Share Icons:

 

తిరుపతి, సెప్టెంబర్ 22,

కేంద్రంలో మోదీ ప్రధానిగా వ్యవబరిస్తున్న తీరు అహంకారపూరితంగా ఉందనేది దేశంలో చాలా మంది బుద్ధజీవులు అంగీకరిస్తారు. కానీ, అదే సమయంలో ఆయనను కాదని మరో ముద్ద పప్పుకు మద్దతు ఇచ్చేందుకు వారి మనసు అంగీకరించడం లేదు. ఆ వెసులుబాటు కారణంగా, గత నాలుగు సంవత్సరాలుగా నరేంద్రమోదీ పాలన నల్లేరుమీది బండి నడక మాదిరి సాగిపోయింది.

కేంద్రం తీసుకున్న చాలా నిర్ణయాలు ప్రజాకంఠకంగా ఉన్నా దేశవాసులు వాటిని మౌనంగా భరించడనికి అదే కారణం. మరో ప్రత్యామ్నాయం లేకపోవడమే. మోడీ తరువాత ఎవరు అనే ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేక చాలా మంది ఇంతకాలం మౌనంగా ఉన్నారు. కానీ అటువంటి వారిని కూడా నోరువిప్పేలాగా చేస్తున్నది రాఫెల్ డీల్ అక్రమాలు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఈ అంశాన్ని పార్లెంటులో ప్రస్తావిచిన సమయంలో మరింత హుందాగా వ్యవహరించి ఉంటే ఈ ఆరోపణలకు సీరియస్ నెస్ వచ్చేది. అలా జరగలేదు. ఇంతకాలం అటు కాంగ్రెస్, ఇటు కొన్ని మీడియా వర్గాలు రాఫెల్ పై చేస్తున్న ప్రచారాన్ని  ప్రజలు పెద్దగా గుర్తించింది లేదు. కానీ ఇపుడు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు చెప్పిన విషయాలు కొత్త లోచనలను రగిలిస్తున్నాయి. ప్రెంచ్ మీడియా వెలికితీయవలసిన నిజాలు కూడా వెలుగు చూస్తే.. మోదీ పరువు బజారునపడనుంది.అదే జరిగితే పప్పులు కూడా వుడుకుతాయ్.

మామాట:  ఇక ఈ ప్రజలు ఎవరిని నమ్మాలి దేవుడా

Leave a Reply