ఇదేమిటి అధ్యక్షా?

Share Icons:

 

తిరుపతి, సెప్టెంబర్ 11,

తెలుగు పత్రికలు కొత్తగా పతనావస్తకు వెళ్లనవసరం లేదు. ఇప్పటికే పత్రికల యాజమాన్యం వర్గాల వారీ విడిపోయి సంబంధిత వార్తలే రాసుకుంటున్నారు. ప్రమాణాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు.

2014 లో విభజనానంతర ఏపీ రాష్ట్ర సాసన సభకు ఎన్నికలు జరిగాయి. మరో 7-8 మాసాల్లో మళ్లీ ఎన్నికలున్నాయి. ఈ లోగా మరో మారు శాసన సభ సమావేశాలు జరుగుతాయా. అటువంటి అవకాశం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. సో.. ఇపుడు జరుగుతున్న శాసన సభ సమావేశాలే చివరివి కావచ్చు. మరలాంటపుడు శాసన సభను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పాలక ప్రతిపక్షాలు భావించడం సహజ పరిణామం. కానీ ఏపీ లో అలా జరగడం లేదు. ప్రతిపక్షం సభకు రాకపోతే మంచిదని పాలక పార్టీ భావిస్తోంది.  సభకు వెళ్లడం వలన ప్రయోజనం లేదని ప్రతిపక్షం అనుకుంటోంది. వారు గత సమావేశాలను కూడా బహిష్కరించిని విషయం గుర్తుండే ఉంటుంది. ఇది అంతా ఎందుకు చెబుతున్నాను… ప్రతిపక్షం లేని సభ ఎందుకు జరుగుతోందో  కనీసం ప్రజలు తెలుసుకోవాలి కదా. రాజ్యాంగంలో పాలక ప్రతిపక్షాలకు సమాన ప్రాధాన్యం ఉంది. కోర్టుల నిర్వహణలో ఎలా న్యాయమూర్తులకు, న్యాయవాదులకూ బాధ్యతులు-హక్కులు సమానంగా ఉంటాయో ఇక్కడా సభను నడపడంలో ఉభయ పక్షాలు ప్రజా సంక్షేమం ప్రధానంగా పయణించవలసి ఉంటుంది.  కానీ జరుగుతున్నదేమిటి.

దీనికి సంబంధించి మంగళవారం సాక్షి పత్రికలో తగునా ఇది.. అధ్యక్షా ? అనే వార్త వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ఏ పత్రిక వార్త రాసింది అని కాకుండా, వార్త లోని సారాంశాన్ని గమనిద్దాం.  మామూలుగా ప్రజాస్వామ్య సంప్రదాయం ప్రకారం అక్కడ కేంద్రంలో లోక్ సభ సభాపతి, ఇక్కడ రాష్ట్రంలో శాసన సభాపతికి అత్యంత గౌరవ ప్రదమైన సంప్రదాయచరిత్ర ఉంది. ఉభయులూ ప్రజాస్వామ్య మూలాలకు ప్రమాదం సంభవించినపుడు తాము అడ్డుపడి, సభాసంప్రదాయాలను కానీ, ప్రజాస్వామ్య విలవలను కానీ పరిరక్షించవలసిన వారు. గతంలో అలా పార్టీలకు అతీతంగా వ్యవహరించి సత్యంవైపు నిలబడిన సభాపతులు మనకున్నారు.  దివంగత సోమనాథ్ చటర్జీని తీసుకోండి, తనకు ప్రాణప్రదమైన పార్టీని కూడా కాదని, పార్టీ తనను బహిష్కరించినా, ఆయన ఆనాడు న్యాయం వైపు నిలబడ్డాడు. పార్టీని వదులుకోవలసి వచ్చినందుకు జీవితాంతం చింతించినప్పటికా, సభా పతిగా నిర్ణయం తీసుకోవలసి వచ్చినపుడు మాత్రం ఆయన సభాపతిగా వ్యవహరించారు. తనను పెంచి పోషించిన పార్టీకి కొమ్ము కాయలేదు. అది విలువలతో కూడిన సంప్రదాయం.

మరి ఇపుడు మన సభాపతి వ్యవహరిస్తున్న తీరు అందుకు దరిదాపులలో కూడా లేదు. కోడెల బాగా చదువుకున్నారు. వైద్యుడుగా పేరున్నావారు. ప్రజా జీవితంలో చాలా కాలంగా ఉంటున్నారు. వారికి ఈ వయసులో ఇక భవిష్యత్తు కోసం రాజీపడవలసిన అవసరం కూడా లేదు. కానీ సభాపతిగా ఉంటూ, ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం దారుణం. ఇతరులు ఎవరైనా ఈ పని చేస్తున్నపుడు , తనకు సమాచారం వస్తే, వారిని వారించి,  పాలను ఫోటోలపై పోయకండి, ఎవరైనా పేద పిల్లలకు పంపిణీ చేయండి అని చెప్పవలసిన వయసు. కనీసం ప్రసూతి ఆసుపత్రిలో పేదమహిళలకు ఆ పాలను పంపిణీ చేయమని చెప్పి ఉండవచ్చు. అటువంటిది ఆయనే స్వయంగా సభాపతిగా ఉంటూ, ఒక పార్టీ సారథికి సాగిలబడడం సభాపతి స్థానాన్ని దిగజార్చడమే. వైసీపీ ఎంఎల్ ఏల  పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులను పరిష్కరించడానికి లేని సమయం, తీరికా, ఇలా ముఖ్యమంత్రి ఫోటోలకు పాలాభిషేకం చేయడానికి ఉన్నాయా. ఇటీవల ఇటువంటి అంశమే ఎదురైనపుడు రాజ్యసభ అధ్యక్షుడు  వెంకయ్యనాయుడు  వెంటనే నిర్ణయం తీసుకున్నారు. కోడెల శివప్రసాద రావు లాగా గడ్డపారలు నానబెట్టలేదు. పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవడానికి ఇంతకాలం ఉపేక్షించాలా, ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని ఇంతగా అవమానిస్తారా. వర్తమాన రాజకీయాలలో నడుస్తున్న వైనాలు గమనించినపుడు ప్రజాస్వామ్యవాదులకు నిరాశకలుగుతోంది. ఎందుకు పెద్ద తరం నాయకులు జోక్యం చేసుకోరు, బుద్ది చెప్పరో తెలియడం లేదు. వారు చెప్పినా, వీరు వినలేదా… ఏమో..

మామాట: రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నవారికి రూల్స్ చెప్పేదెవరు.

Leave a Reply