మరో వంచన కూటమి!

Share Icons:

తిరుపతి, సెప్టెంబర్ 10,

ఈ రోజు 10.09.18 ఈనాడు లో మహాకూడటమి యోచనలో తెదేపా వార్త చూడండి.. దాని నేపథ్యం ఇదీ,

కాంగ్రెస్ పార్టీ పై వ్యతిరేకతే ప్రధాన సిద్ధాంతంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో తెలంగాణాలో  అదే పార్టీతో  చేతులు కలిపేందుకు సిద్ధమైంది. ఈ పరిణామాల్లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన నందమూరి హరికృష్ణ బతికివుంటే తీవ్రంగా వ్యతిరేకించి పార్టీ నుంచి బయటకు వచ్చేవారని టిడిపిలోనే ఆఫ్ ది రికార్డ్ లో కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. హరికృష్ణ గత కొంతకాలంగా చంద్రబాబు తో ఎడముఖం గానే వుంటూ వస్తున్నారు. తన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పించకపోవడం పై ఆయన అసంతృప్తిగా ఉండేవారని ఆయన సన్నిహితుల సమాచారం. తండ్రి ఎన్టీఆర్ ఆశయం, ఆకాంక్ష తన శ్వాసగా మాట్లాడే హరికృష్ణ పాలిట్ బ్యూరో సభ్యుడుగా వున్నారు. ముక్కుసూటిగా వుండే హరికృష్ణ అంటే చంద్రబాబు కు సైతం కొంత టెన్షన్ అంటారు.టిడిపి కాంగ్రెస్ లు పొత్తు వాసనలు గుప్పుమనగానే కస్సున లేచారు ఏపీలో సీనియర్ మంత్రులు అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణ మూర్తి. వారికి ఆ తరువాత చంద్రబాబు సర్ది చెప్పడంతో తాత్కాలికంగా వివాదం సర్దుమణిగింది. పొత్తు తెలంగాణ వరకే ఉంటుందని లీడర్లను, క్యాడర్ ని బాబు శాంతిప చేశారు. అయితే తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తు ఎపి పై కూడా పడుతుందన్న ఆందోళన టిడిపి వర్గాల్లో బాగా వుంది.ఎపి విభజన చేసి కాంగ్రెస్ ఎలా నష్టపోయిందో అలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందేమో అన్న భయం పలువురిని వెంటాడుతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పై యుద్ధం ప్రకటించి అధర్మం గా రాష్ట్ర విభజన చేశారని ఎన్నికల్లో భారీగా లబ్ధిపొందిన తెలుగుదేశం అలాంటి పార్టీతో పొత్తుకు వెళ్లడం ఆత్మహత్యసదృశ్యమని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. అందుకే బాబు తెలంగాణ లో కాంగ్రెస్ తో చేతులు కలిపే అంశాన్ని టిటిడిపి కి అప్పగ్గించి లౌక్యత ప్రదర్శించారు. అయినా కానీ ఏపీలో పరిణామాలు ఎలా వుంటాయో అన్న ఆందోళన మాత్రం టిడిపి ని వీడటం లేదు. మరి చంద్రబాబు ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో వేచి చూడాలి.

ఈ నేపథ్యంలో ఈ రోజు ఈనాడు అనుకూల వాదన తెరపైకి తెచ్చింది మబాకూటమిని ప్రస్థావించింది. నేరుగా కాంగ్రెస్ తెలుగుదేశం పోత్తుకు వెళ్లకుండా, సీపీఐ, టిజేసీ వంటి మరికొన్ని చిన్నా చితకా పార్టీలతే కలిస్తే దానికి మహాకూటమి అనే పేరు పెట్టవచ్చు,  పోత్తు వ్యతిరేకతను అడ్డుకోవచ్చుననేది టీడీపీ తాజా వ్యూహంగా కనిపిస్తోంది.  అందుకు అనుకూలంగా మీడియాలో కథనాలు వండుతున్నారు. అవసరమనుకుంటే మరో రండు డమ్మీ పార్టీలను వారే తెరపైకి తెస్తారు కూడా,

ఇది ఇలా ఉండగా, తెలంగాణ రాజకీయ వ్యవహారాలను ఆంధ్రా నుంచే చంద్రబాబు తనయుడు లోకేష్ నడిపించనున్నారా …? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే కాంగ్రెస్ తో పొత్తు అనంతరం లోకేష్ కీలక బాధ్యతలను నిర్వర్తిస్తారని తమ్ముళ్ళు అంచనా వేస్తున్నారు. ఏపీలో రాబోయే ఎన్నికలు టిడిపికి చావో రేవో అన్నట్లుగా పరిస్థితి నడుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ పాతుకుపోవాలంటే ఆంధ్రప్రదేశ్ లో సత్తా చాటాలిసిన అవసరం వుంది. తెలంగాణ పాలిటిక్స్ పై పెదబాబు దృష్టి పెడితే మొదటికే మోసం వస్తుందని ఇప్పటికే పార్టీ సీనియర్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవహారాలపై బాగా పట్టున్న చినబాబుకు వాటిని అప్పగిస్తారని తెలుస్తుంది. పైకి తెలంగాణ శాఖకు అధికారాలు కట్టబెట్టమని చెబుతున్నా లోకేష్ పర్యవేక్షణలోనే అన్ని సాగుతాయని అంటున్నారు.చాలా కాలంగా టి పాలిటిక్స్ పై మౌనంగా వున్న లోకేష్ తెలంగాణ ప్రభుత్వం రద్దు చేస్తూ కెసిఆర్ గవర్నర్ ను కలవగానే అమరావతిలో మీడియా వద్ద చిట్ చాట్ పెట్టి ఫైర్ అయ్యారు చినబాబు. అది కూడా నేరుగా కెసిఆర్ ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. ఇదంతా టి ఎన్నికలకు టిడిపి చినబాస్ కు ట్రయిల్ రన్ గా చంద్రబాబు బాధ్యత పెట్టడం వల్లే అన్నది టాక్. అయితే గత భాగ్యనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ బాధ్యతలను లోకేష్ వహించారు.కానీ ఫలితం బెడిసికొట్టింది. ఆ ప్రభావం చినబాబు పై పడకుండా అమరావతికి రప్పించారు చంద్రబాబు. ఆయన్ను ఎమ్యెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చి తనవద్దే రాజకీయ ఓనమాలు నేర్పిస్తున్నారు. అయితే ఇప్పుడు కెసిఆర్ అండ్ కేటిఆర్ టీం తో నేరుగా కాకుండా చినబాబు పరోక్ష యుద్ధం ఎపి నుంచే మొదలు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రయత్నం ఏ మేరకు విజయవంతం అవుతుందో రాబోయే ఎన్నికల ఫలితాలు తేల్చేయనున్నాయి.

చూద్దాం. కేసీఆర్ ముందు ఈ పోత్తులు, కూటములు ఎంతవరకు పనిచేస్తాయో.. గురువు(చంద్ర బాబు) శిష్యుడు (కేసీఆర్ ) లలో ఎవరు తెలివైనవారో తేల్చే ఎన్నికలివి.

 

మామాట:  రాజకీయ ఎత్తులు ఎవరు బాగా వేయగలరు

Leave a Reply