చెప్పేటందుకే నీతులు…

Share Icons:

 తిరుపతి, సెప్టెంబర్ 06,

భారత ప్రజాస్వామ్యం విచిత్రమయినది. అనేక దేశాల నుంచీ ఎంపిక చేసి తీసుకున్న అత్యున్నత రాజ్యాంగ నియమాలతో భారత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. అయితే, ఇపుడు జరుగుతున్న తీరు చూసినపుడు రాజ్యాంగం పరిహాసమవుతున్న వైనం ప్రజాస్వామ్య ప్రేమికులకు కలవరం కలిగిస్తుంది.  ముఖ్యంగా దేశంలో వామపక్షాల తీరు వరుస చారిత్రిక తప్పిదాలతో ప్రజలకు దూరంగా జరుగుతోంది. ప్రధాన స్రవంతిలో ఇమడలేక, కొత్త విధానాలను అలవరచుకోలేక వామపక్షాలు తికమక పడుతున్న సంగర్భాలు చాలా ఉన్నాయి. అటువంటిదే తాజా పరిస్థితి.. ఒక సినామా నటుడితో కలిసి నడవాలనుకుంటున్నాయి. ఆయన సిద్దాంతాలు ప్రకటించలేదు. రాజకీయ మార్గాన్ని ఎన్నుకోలేదు. ప్రజల్లో తిరుగుతున్నారంతే… స్థిరమైన పార్టీ విధానం ఏదీ రూపొందించుకోలేదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వ్యవహరిస్తున్నారు.

ఇక తెలంగాణలో ప్రధాన వామపక్ష పార్టీలుగా ఉన్న సీపీఎం, సీపీఐ చెరో దారి చూసుకున్నాయి. ఇప్పటికే బహుజన లెఫ్ట్ ఫ్రంటుతో జతకట్టి సీపీఎం విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, తానూ ఓ ఫ్రంటు ఏర్పాటు చేసేందుకు సీపీఐ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో సీపీఐ ఎదుట సీపీఎం పలు ప్రతిపాదనలుంచింది. బీఎల్‌ఎఫ్‌తో కలిసి రావాలని, లేదా.. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్ లేకుండా సీపీఐ ఫ్రంటు పెడితే ఆ ఫ్రంటుతో తామే కలిసొస్తామని సీపీఎం ప్రతిపాదించింది. ఈ మేరకు ఇటీవల ఇరు పార్టీల రాష్ట్ర స్థాయి నాయకులు సమావేశమయ్యారు. తాజాగా, సీపీఎం ప్రతిపాదనను సీపీఐ తోసిపుచ్చింది.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్ తమ ప్రధాన శత్రువని, బీజేపీ మినహా కేసీఆర్‌ను ఓడించేందుకు ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధమని ప్రకటించింది.కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు పెట్టుకుంటే ఉభయ కమ్యూనిస్టు పార్టీల నడుమ పరస్పర పోటీని నివారించాలని సీపీఎం మరో ప్రతిపాదన చేసింది. సీపీఐ పోటీ చేసే స్థానాల్లో తాము అభ్యర్థిని నిలబెట్టబోమని ప్రకటించిన తమ్మినేని, సీపీఎం పోటీ చేసే స్థానాల్లో సీపీఐ నుంచి అభ్యర్థిని నిలపవద్దని కోరారు. ఈ ప్రతిపాదనను కూడా సీపీఐ తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని కొన్ని స్థానాలకూ ఇరు పార్టీలు అభ్యర్థులను నిలపాలని భావిస్తుండమే ఇందుకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపక్షాల ఐక్యతకు సీపీఎం గండి కొడుతోందని కాంగ్రెస్ భావిస్తున్న పక్షంలో, పోటీ నివారణకు కాంగ్రెస్ కూడా ఒప్పుకోదన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. కార్యకర్తల బలమున్న నాలుగైదు స్థానాల్లో పోటీ చేయడానికే సీపీఐకి అవకాశముండగా, ఆ స్థానాలను కాదని వేరే స్థానాలను ఆశించే స్థితిలో ఆ పార్టీ లేదు.బీఎల్‌ఎఫ్‌తో కలిసొచ్చే విషయమై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాంతో తమ్మినేని వీరభద్రం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిరువురు రెండ్రు, మూడురోజుల్లో ప్రత్యేకంగా భేటీకానున్నట్లు సమాచారం. కోదండరాం నాయకత్వానికి కాంగ్రెస్ అంగీకరిస్తేనే, ఆ పార్టీతో పొత్తుకు సమ్మతిస్తామని టీజేఎస్ నాయకులు పట్టుబడుతున్నారు. ఇదంతా ఎందుకు.. క్లారిటీ లేనందుకు.  సరైన దారి ఏదో తెలియనందుకు. వామపక్షాలు ఇప్పటికీ మేలుకోనందుకు..

షరాః –

శాసన సభకు రాని వైసీపీ ఎంఎల్యేలు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారని సీఎం చంద్ర బాబు ప్రశ్నించినట్టు ఈనాడు ప్రధాన వార్త వేసుకుంది. మరి పార్టీ ఫిరాయించిన సభ్యులపై చర్యలు తీసుకోవడానికి ఇంతకాలంగా సమయంలేకపోయిన గౌరవ సభాపతి ఎందుకు జీతం తీసుకుంటున్నట్టో…

Leave a Reply