విద్య-వివేకం-ప్రవచనం-ఆచరణ

Share Icons:

తిరుపతి, సెప్టెంబర్ 05,

ఈ రోజు ముందుగా విద్య బోధించే గురువులందరికీ హృదయపూర్వక నమస్సులతో మొదలుపెడదాం.  నిజానికి భారతావని విశ్వగురుస్థానంలో మరింత ఉన్నతంగా ఉండవలసింది. వివేకానందుడు, సర్వేపల్లి రాథాకృష్ణ. జిడ్డుకృష్ణమూర్తి ఇట్లా మహామహులు భారతీయ తాత్వికతను బోధించారు. అయితే పాలనాపరంగా మనలను బలహీనులుచేయడానికి ఆనాడు బ్రిటీషు వారు పన్నిన ఇంగ్లీషు చదువులనే ఊబిలో పడ్డ మనం 72 సంవత్సరాల తరువాత (స్వతంత్ర్యం సిద్దించి) కూడా బయట పడలేక పోతున్నాం. ఇంకా గుడ్డిగా, చెప్పాలంటే స్వంత అజెండాల మేరకు వాస్తవ విషయాలను విద్యార్థులకు బోధించలేక పోతున్నాం. అలా పసి తనంలోనే పిల్లలు వర్తమానానికి-వాస్తవానికి ఉన్న విభజన రేఖకింద నలిగిపోతున్నారు. ఆత్మనూన్యతతో పెరుగుతున్నారు.

అందులవననే భారత పౌరులలో పోరాట పటిమ లోపుస్తోంది. మాతృదేశం, మాతృభాష వంటివి అనేక వైరుధ్యాలతో నిండి న్నాయని పసిమనసులో నాటుకుంటున్న విషబీజాల కారణంగా యువతరం వయసురీత్యా ఎదుగుతున్నా, మానసికంగా ఎదగడం లేదు. కేవలం అనుకరణలో జీవితాలను వెలవెలబోయేట్లు చేసుకుంటున్నారు. తమ మూలాలను, అస్థిత్వాన్ని గర్వంగా చెప్పుకోలేనపుడు నీరసం ఆవహిస్తుంది. అదే జరుగుతోంది. 125 కోట్ల మందిలో ఎందుకు నోబుల్ గాని, ఒలంపిక్ పతకం గానీ, ప్రపంచ ప్రఖ్యాత స్థితిని పొందలేక పోతున్నారు.  ఒకరో ఇద్దరో ఉద్యోగాల రీత్యా ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నా అందులో విశ్వవ్యాపార సూత్రాలు కూడా అమరి ఉన్నాయన్నది కాదనలేని సత్యం.

ముఖ్యం నేటి మన విద్యావిధానం శీలనిర్మాణం చేయగలిగిన విద్య కాదు. కేవలం ఏబిసీడీ లు గుర్తించే పోటీ పరీక్షల్లో విజయం సాధించిపెట్టే చదువు మాత్రమే.. ఇప్పుడెక్కడున్నారు గొప్ప గురువులు…. స్ఫూర్తి నింపే ఉపాధ్యాయులుంటేనే పిల్లల భవిత వికసిస్తుంది. లేదంటే వారిలో వ్యక్తిత్వం లోపిస్తుంది. డిగ్రీలు పోంది, ఉద్యోగాలు చేస్తే సరా.. మానవీయ విలువలు లేని ధనవంతుల సమాజం లోక హింత కాదు. ఈ విషయం ఎంత త్వరగా గ్రహిస్తే సమాజానికి అంత మంచిది. ఇందులో ముందుండవలసినవారు మాత్రం ఉపాధ్యాయులే.

 

ఈరోజు ఈనాడులో ఉపరాష్ట్రపతి వెంకయ్య ఓ వ్యాసం రాశారు. ఈ వ్యాసం నిజంగా అయనే రాసి ఉంటారా, కనీసం ఓ సారి చదివి ఉంటారా… ఎందుకంటే… అందులోని విషయాలు బ్రహ్మ పదార్థాలు కాదు. వెంకయ్య చాలా సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న వారితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. స్వయంగా కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇపుడు ఉపరాష్ట్రపతి హోదాలో పత్రికలు వ్యాసాలు రాసేసి ఊరుకోకుండా వారు క్షేత్రస్థాయిలో చేస్తున్నదేమిటో తెలుసుకో వలసిన అవసరం ఉంది.  ఉపరాష్ట్రపతిగా ఐదు సంవత్సరాలుంటారు కదా, ఆ రాజ్యాంగ పదవీకాలంలో ఆయన తను ఈ నాటి వ్యాసంలో చర్చించిన విషయాలను అమలుచేయించేందుకు త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తారా, ఇప్పటికే పదవీకాలంలో ఏడాది గడిచిపోయింది. ఇక ఉన్నది ఎంత కాలం.. ఆయన ఏమి చేయనున్నారు. మరో రెండు మూడు వ్యాసాలు రాస్తారు అంతే నా… దానితో విద్యావ్యవస్థ మారిపోతుందా… అలా జరగాలని ఆశిద్దామా….

మామాట : ఆచరణ శూన్యప్రవచనాల వలన  ఫలమేమిటో

Leave a Reply