పాలకులు -బాజాలు

Share Icons:

తిరుపతి, సెప్టెంబరు 01.

తెలంగాణలో ఏం జరుగుతోంది. ప్రభుత్వం స్వంతంగా భుజాలు చరుచుకోవడం దేనికి సంకేతం.. పాలకులు భయపడడం సామాన్యంగా మారిపోయింది. కేంద్రంలో బీజేపీ అధినాయకులు మోదీ, షా ఏకపక్షంగా వ్యవహరిస్తూ మిత్రులను దూరం చేసుకుంటున్నారు. ఇక్కడ ఏపీలో పాలకచంద్రుడు స్వయంగా నీడను చూసినా ఝడుసుకుంటున్నాడు. కేసీఆర్ కాస్త విజ్ఞత ఉన్నవాడుగా కనిపించినా, అతనూ ఆ తానులో ముక్కేకదా అనిపిస్తున్నాడు. తెలంగాణ అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. నిజంగానే ఒక మంచి అవకాశాన్ని కేసీఆర్ చేచేతులారా జారవిడుచుకుంటున్నాడు.  అప్పుడెప్పుడో కేంద్రంలో అవిశ్వాసం పెట్టినపుడు జగన్ వ్యూహంలో చంద్రబాబు చిక్కుకున్నారని మోదీ పార్లంమెంటు వేధికగా ప్రకటించారు. కానీ తెలంగాణలో బీజేపీ వేసిన పాచికలో కేసీఆర్ చిక్కుకున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. లేకపోతే అటు కోదండరమ్ తో వైరం పెంచుకుంటున్న తెరాసా సారథి..  వరవరరావు విషయంలో  పప్పులో కాలేశాడు. పోరాటాల పురిటి గడ్డ తెలంగాణాలో నక్సలైట్లను తెలంగాణ బిడ్డలన్న కేసీఆర్ సార్ పౌరహక్కుల నేతల పట్ల ప్రదర్శిస్తున్న వైఖరి వేధావులలో ఆలోచన కలిగిస్తోంది. తక్కినచోట ఉరకుంటారేమో కానీ, తెలంగాణ ప్రజలు అటువంటివాటిని హర్షించరుకదా. చూద్దాం ఏంజరుగుతుందో.

రాష్ట్రంలో తెరాసా పాలనపట్ల ప్రజల్లో భ్రమలువీడుతున్నట్టే కనిపిస్తోంది. అందుకే ప్రగతి నివేదన సభ పేరుతో హడావుడు చేసి ముందస్తుకు వెళ్లాలను కేసీఆర్ భావిస్తున్నారు. ప్రభుత్వం మంచి పనులు చేసి ఉంటే అవే పాలకుల విజయాలను ప్రతిధ్వనిస్తాయికదా, అదే దో సినిమాలో చెప్పినట్టు నేను కాదు నా పనులు మాట్లాడాయి అన్నట్టు.. మనం చేసిన పనులు మాట్లాడాలి కానీ మనమే బాకాఊదుకోవడం భయానికి సంకేతం గా భావించవలసిందే… భారత్ విలిగిపోతోందని వాజపేయీ ఇలా ఎన్నికలకు వెళ్లి సాధించిన ఫలితమే చంద్రశేఖరరావుకూ లభించుగాక… తథాస్తు.

చంద్రశేఖరరావు దారిలోనే చంద్రన్న కూడా తాను ముస్లీం సోదరులకు పెద్ద సోదరుడనని నిరూపించుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా మైనారిటీ సంక్షేమానికి తెలుగుదేశం పాలకులు పాటుపడి ఉంటే ఇపుడిన్నిపాట్లు పడవలసిన అవసరం ఉండేదికాదుకదా, ఆ పనులే చంద్రన్నహమారా అని నినదించేవి కదా, అలా కాకుండా అసంతృప్తి వ్యక్తం చేసినవారిని పోలీసులతో చితకబాధించడం ఏమి విధానం. ప్రజాస్వామ్యంలో నిరసనతెలపడం ప్రాధమిక హక్కు కదా, దానిని కూడా అడ్డుకుంటే ఎట్లా..  ఇదేమి ప్రజాస్వామ్యం.. అక్కడ స్వామి అగ్నవేశ్ వంటి వారిపే కేంద్రపాలకుల మద్దతుదారుల దాడులు.. వరవరరావుపై కుట్రకేసులు. ముస్లేం యుకులపై పోలీసులజులుం… ఏం జరుగుతోంది దేశంలో… గొంతెత్తేవారు లేరా.. ఇప్పటికి లేకపోవచ్చు… కుత కుతా ఉడుకుతూనే ఉంటే… కుక్కర్ పేలిపోకమానదు.

 

మామాట: పనులు చేయకపోతేనే అదే పనిగా సభలు పెట్టుకుని చెప్పాలి గొప్పలు

Leave a Reply