మరణమూ ఓ అవకాశమూ

Share Icons:

 

తిరుపతి, ఆగస్టు 31

 

నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ముగిసాయి. మరణించిన వ్యక్తికి తుది సంస్కారం జరిగితీరుతుంది. ఇందులో కొత్తేమీ లేదు. కానీ తెలుగు నేలలో రాజకీయాలు పోతున్న వైనాలు చూసినపుడే విచారం కలుగుతుంది. రాజకీయం అంటే ఇంత దిగజారుడుగా ఉంటుందా.. అనే అనుమానం కలుగుతుంది.

తెలుగుదేశం పార్టీ ప్రకటించిన  రామారావు తరువాత ఆ పార్టీకి చివరి వరకు విశ్వాసంగా ఉన్నవాడు హరికృష్ణ. చాలా కొద్దికాలం బావతో విభేదించి అన్న తెలుగుదేశం పెట్టినా, ఆవేశం తగ్గిన కొద్దిరోజులకే మళ్లీ వెనక్కువచ్చాడు. అది అలా ఉంచితే, చేతన్యరథ సారథిగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడుగా, పార్టీ అత్యున్నత కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా, అతను మరణించినపుడు పార్ధివ దేహాన్ని హైదరాబాదులో ఉన్న తెలుగుదేశం కార్యాలయానికి తీసుకు వచ్చి, పార్టీ పరంగా ఘన నివాళి ఇచ్చి ఉండవలసింది. పార్టీతో మరెవరికీ లేని అనుబంధం హరికృష్ణది. ఇక్కడ పివీ మరణానంతరం ఢిల్లీలో సోనియా వ్యవహార శైలి గుర్తుకు వస్తోంది. ఈ విషయంలో చంద్ర బాబును క్షమించలేము. ఆనాడు పివీకి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయమే నేడు టీడీపీ హరికి చేసింది. జండా కప్పడం, పాడె మోయడం కాదు. పార్టీ తరపున నివాళి ఉండాలి కదా,

హరికృష్ణ మరణం తరువాత పార్టీ పరంగా నివాళి అర్పించడంలో చంద్రబాబు విఫలమైనారు. కానీ, వ్యక్తిగా, బంధువుగా, కుటుంబపరంగా హరికి అన్నీ తానై వ్యవహరించాననే భావన కలిగించడంలో బాబు సఫలమైనారు. రెండు రోజులో ఇక్కడే ఉండి అన్నీ జరిపించినట్టు ప్రపంచానికి చాటుకున్నారు.

 

మరో ముఖ్యమంత్రి, తెలంగాణ సీఎం చంద్రశేఖర రావు కూడా అకస్మాత్తుగా హరికృష్ణపై వాత్సల్యం కురిపించారు. నిజానికి ఇద్దరు చంద్రులు హరికృష్ణ మరణ వార్త తెలియగానే పాదరసంకంటే వేగంగా స్పంధించారు. ఎక్కడా ఒకరికి ఒకరు తగ్గకుండా పై చేయి సాధించడానికి చేయవలసిందందా చేశారు. దివంగత నందమూరి కుటుంబం తనతోనే ఉందని, తాను వార పట్ల తగిన అక్కర కనబరుస్తూనే ఉన్నానని చాటుకోవడం చంద్రబాబుకు ఉన్న అవసరం. అలాగే, హరికృష్ణ మరణానంత నివాళిలో ఉదారత కనబరిచి వచ్చే ఎన్నికల్లో సీమాంద్రుల సానుభూతి తగినంత సొమ్ముచేసుకోవడం కేసీఆర్ వాటా, అటు వరవరరావు అరెస్ట్ పై వస్తున్న పొగల సెగలను చగ్గించే ఆట. అసలే ముందస్తు ఎన్నికల నగారా చేతబట్టి తిరుగుతున్న కేసీఆర్ కి హరి మరణం అంది వచ్చిన అవకాశం, అంతే ఎక్కడా తగ్గలేదు.. వెంటనే మంత్రులను పురమాయించాడు. అధికార లాంఛనాలు ప్రకటించాడు, మహాప్రస్థానంలో 450 గజాల స్థలం కేటాయించాడు, ఎవరూ నోరు తెరిచి అడగనైనా అడగక ముందే హరి స్మారకం తెలంగాణ ప్రభుత్వమే కట్టిస్తుందని ప్రకటించేశాడు. అపుడే కదా, ఎన్నికల నాటికి మరి కొన్ని వార్తలు వండి హైదరాబాదులోని సీమాంధ్రుల ఓట్లు వార్చుకోవచ్చు.

ఇద్దరు ముఖ్యమంత్రులు ఇలా ఒక మరణం నుంచీ కూడా ఓట్లు పొందే వేడుకలో ఉంటే.. రాజకీయాలను చూసి సంతోషిద్దామా, ఇటువంటి అనైతిక ఆటలు ఆడలేకపోయినందుకు, తెలుగుదేశంలో  తగిన వాటా దక్కించుకోకుండా దగా పడి వెళ్లిపోయినందుకు హరికృష్ణ ను  చేతకాని వ్యక్తిగా భావిద్దామా..

 

ఈ అగ్గికి ఆజ్యం పోస్తూ తెలుగు పత్రికలు కొన్ని చంద్రబాబు కుటుంబ పెద్దగా వ్యవహరించాడని, అన్నీ తానై వ్యవహరించాడనీ రాయడం వింత. కుంటుబ పెద్ద అంటే హరికృష్ణకంటే ముందు పుట్టిన వారు ఉన్నారు, లేదా ఇంటికి పెద్ద అళ్లుడు దగ్గుబాటి ఉన్నాడు.. వారిరువురునీ కాదని చంద్రబాబు పెద్దరికం ఎందుకు వహించారో… పైవాడికే తెలియాలి.

 

మామాట: దేనినీ వదిలిపెట్టక వాడుకోవడమే రాజకీయమేమో..

Leave a Reply