మన ఏంపీలు ఏమి చేస్తుంటారు?

Share Icons:

తిరుపతి, ఆగస్టు 28,

రాజకీయాలు ఆటగా మారిపోయాయి. అందులో ఇబ్బందిలేదు. నిబంధనల మేరకు ఆడితే…  ప్రతి ఆటగాడూ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ పోతేనే ఇబ్బంది. ఇదే రీతిలో పత్రికలు కూడా ఒక పద్దతి మేరకు వ్యవహరించాలి. కానీ ఇటీవలి కాలంలో ఏ జరుగుతోంది… పత్రికలను ప్రజలు డబ్బుపెట్టి కొనాలి, భారీగా ప్రకటనలు వస్తేనే కానీ పత్రిక నడవదు. అయితే సామాజిక మాధ్యం అలా కాదు… నెలకు మూడు నాలుగు వందలు ఇంటర్నెట్ బిల్లు చెల్లించగలిగి, ఒక స్మార్ట్ ఫోన్ ఉన్నా, ల్యాప్ టాప్, పీసీ వంటి ఉంటే మనమే ఒక పత్రిక నడిపేయవచ్చు.. మన ఇష్టం వచ్చిన కామెంట్ పెట్టేయ వచ్చు. నోటికి వచ్చింది రాసేయ వచ్చు. దీనికి ఏ నిబంధనా అడ్డురాదు. సెన్సార్ లేదు.. అదేమంటే ఆర్టికల్ 19 అంటారు, రాజ్యాంగ హక్కు, స్వేచ్ఛ అని ఉపన్యాసాలు ఇస్తారు. పత్రికల్లో అవకతవకలను, రిపోర్టింగ్ లోపాలను ఏకి పారేసే వెబ్ పత్రికల లోపాలను పట్టించుకునేవారెవరు.. వారు పప్పులో కాలు వేయడమే కాదు ఏకంగా జారిపడుతున్నా… పట్టించుకోరా, అది ఎందుకు ప్రశ్నార్హం కాదు.

మంగళవారం (28.08.18) తెలుగు ప్రముఖ దిన పత్రికలలో వార్తలు ఈనాడు… పతకాల పరుగు అంటూ ఆసియాక్రీడల వివరాలు ప్రముఖంగా ప్రచురించారు. దిగువన బాండ్ భళా అంటూ అమరావతి బాండ్ల లిస్టింగ్ వార్త ఇచ్చారు. మరో వైపు హైకోర్టు విభజన వార్త ప్రచురించారు. దాదాపు ఆంధ్రజ్యోతి కూడా ఇదే రీతిలో నాదీ భరోసా అని ఏపీ సీఎం  అమరావతి బాండ్ల జారీ వార్తను, చరిత్రకు ఒక్క అడుగు అంటూ ఆసియా క్రీడల వార్తలు ఇచ్చింది. సాక్షి పత్రికలో ప్రధానంగా తెలంగాణ ముందస్తు హడావుడి, నవంబరు రెండో వారంలో షెడ్యూల్ అనే వార్తలు ప్రచురించారు. దిగువన పెట్టుబడులతో రండి అని అమరావతి బాండ్ల వార్త, కమీషన్ల యావ తప్ప జన ఘోష పట్టలేదు అంటూ జగన్ పర్యటన విశేషాల వార్తను ఇచ్చారు. ఎందుకంటే… ఏపీ బయట ఏమి జరుగుతోందో మన పత్రికలకు తెలుసా… కొత్త ఢిల్లీలో ఏపీ ఎంపీల వైనాలు వైనవైనాలుగా చెప్పుకుంటున్నారు.. ఈ వివరాలు చదవండి…

ఏపీ ఎంపీల గురించి మ‌న పొరుగు రాష్ట్రం, దాయాది రాష్ట్రం తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేయ‌డం మీడియాలోనూ ప్రజ‌ల్లోనూ తీవ్ర చ‌ర్చకు దారితీసింది. ప్రస్తుతం ఏపీకి సంబంధించిన స‌మ‌స్యల‌పై ఢిల్లీలో వీరోచితంగా పోరుడుతున్న ఎంపీల‌కు సంబంధించి ఇక్కడి స్థానిక ప్రభుత్వ అనుకూల మీడియాలో భారీ ఎత్తున క‌థ‌నాలు వ‌స్తున్నా యి. పార్లమెంటులో ప్రభుత్వాన్ని క‌డిగేస్తున్నార‌ని, ప్రధానిని నిల‌దీస్తున్నార‌ని, క్షణ‌మైనా తీరిక లేకుండానే కేంద్రంపై ప్రశ్నల వ‌ర్షం కురిపిస్తున్నార‌ని ఈ క‌థ‌నాలు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

ఇక‌, ఈ ఎంపీల్లో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఉంటే  వారికి మ‌రింత గా ఈ మీడియా ఫోక‌స్ చేస్తోంది. క‌థ‌నాలు క‌థ‌నాలుగా వారి గురించి పొగ‌డ్తల వ‌ర్షం కురిపిస్తోంది.  వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ క‌థ‌నాలు నిజ‌మేన‌ని అనుకుంటున్నారు. అంతేకాదు, త‌మ‌కోసమే ఈ ఎంపీలు ఢిల్లీలో పోరాడుతున్నార‌ని అంటున్నారు. కానీ, వీరిని అతిస‌మీపం నుంచి గ‌మ‌నించాన‌ని చెబుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌న ఏపీ ఎంపీల‌పై కీల‌క‌మైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి.. సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తాను ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రుల్ని కలిసినప్పుడు వారంతా టీఆర్ ఎస్ ఎంపీలను మెచ్చుకుంటారని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ‌కు చెందిన‌ ఎంపీలంతా ప్రజా సమస్యలు.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని అడుగుతున్నార‌ని చెప్పారు. ఈ విష‌యం త‌న‌కు కేంద్రమంత్రుల్లో త‌న‌తో స‌న్నిహితంగా ఉండే వారే చెప్పార‌ని కూడా కేసీఆర్ వివ‌రించారు.

గ‌తంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ ప‌నిచేయ‌డంతో ఆయ‌న‌కు ఢిల్లీలో మంచి ప‌లుకుబ‌డి ఉంది. ప‌లు శాఖ‌ల‌కు చెందిన సెక్రట‌రీలు కూడా కేసీఆర్‌ను క‌లిసి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే కేసీఆర్ వద్ద ఏపీ ఎంపీల ప్రస్తావ‌న కూడా చేశార‌ట . స‌ద‌రు కేంద్ర మంత్రి ఒక‌రు.. ఏపీ అధికారపక్ష ఎంపీలు మాత్రం ప్రతిసారీ పైరవీలతో తమ వద్దకు వస్తారని చెప్పినట్లు కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. ఏపీ టీడీపీ ఎంపీల్లో చాలా మందికి సొంత వ్యాపారాలు ఉన్నాయ‌ని , వాటిని రక్షించుకోవ‌డం కోసం, వాటికి అనుమ‌తులు తెచ్చుకోవ‌డం కోసం, త‌మ బంధువుల వ్యాపారాల విస్తర‌ణ వంటి విష‌యాల‌ను కేంద్రం మంత్రుల‌తో చ‌ర్చించిన‌ట్టు కేసీఆర్ స్వయంగా త‌న మంత్రి బృందానికి వివ‌రించ‌డం తాజాగా సంచ‌ల‌నం రేపుతోంది.

నిజానికి కేసీఆర్ ఎప్పుడూ ప‌క్కరాష్ట్రం ఎంపీల గురించి మాట్లాడింది లేదు. కానీ, ఆయ‌న నోటి నుంచి ఇప్పుడు ఏపీ టీడీపీ ఎంపీల గురించి ఇలా వ్యాఖ్యలు రావ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. ఈ క్రమంలోనే మ‌రో రెండు విష‌యాల‌ను ఇక్కడ చ‌ర్చించుకోవాలి. వీటిలో ఒక‌టి.. అవిశ్వాసం సంద‌ర్బంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. చంద్రబాబు క‌న్నా కేసీఆర్ ప‌రిణితి గ‌ల సీఎం అని మెచ్చుకున్నారు. ఇక‌, రెండో విష‌యం మ‌న ఎంపీలు దీక్షల గురించి ఢిల్లీలో మాట్టాడుతూ.. బ‌రువు త‌గ్గించుకునేందుకు స‌న్నబ‌డేందుకు దీక్షలు బాగుంటాయ‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. సో  ఇవి రెండు నిజ‌మ‌ని తెలిసిన‌ప్పుడు.. పైన కేసీఆర్ చెప్పింది కూడా నిజం ఎందుకు కాకూడ‌దు! అందుకే మ‌న‌వారికి ఢిల్లీలో విలువ లేకుండా పోయిందని ప్రజలు అనుకుంటే అది వారితప్పెలా అవుతుంది.

మామాట: వ్యాపార వేత్తలకు వారి కుటుంబాలకు ఎంపీ టెకెట్లు ఇవ్వకూడదు…

Leave a Reply