అబ్బా.. బాబన్న సీరియస్సైపోయారట!

Share Icons:

తిరుపతి, ఆగష్టు25,

చెప్పిందే జరుగుతున్నట్టుంది. నిన్న ఇదే కాలం ఓ సారి గురుతు చేసుకోండి… ఇది కూడా బాబన్న ఆడుతున్న నాటకం కాదు కదా, ఈ రెండు గొంతులు బయడపడడంతో తక్కిన వారు కూడా స్వరం పెంచుతారు. అపుడు ఆ వ్యతిరేక స్వరాలు గుర్తించి ఎన్నికలనాటికి వారి మాటకు విలువ లేనివిధంగా ఒక వాతావరణం సృష్టించడానికి కూడా చంద్రబాబు ప్రయత్నించి ఉండొచ్చనిపిస్తోంది. (ఆటలో అరటి పండా ఏమిటి?)

అచ్చంగా అలాగే జరగలేదా… నిన్న తెలుగుదేశంలో కలకలం… ఏందబ్బా ఇద్దరు సీనియర్లు ఇలా అంటున్నారే అని గుసగుసలు… ప్రైవేటు మాటల్లో కాంగ్రెస్ తో కలవడం పై విభిన్న వాదనలు వినిపించాయి. ఇదంతా నిఘా వర్గం గమనిస్తోందన్న యాది లేదు కదా మనోళ్లకు… అదే చంద్రబాబుకు కావలసింది. నాడి పట్టుకునే ప్రయత్నంలో మరో అడుగు ముందుకు వేశాడు. గొంతు పెంచినవారిని గుర్తించాడు… మళ్లీ సాయంత్రం మరో నాటకం సీనియర్లైనా ఉపేక్షించం.. ఇలా బయట మాట్లాడకూడదని వారికి తెలియదా అని ఆగ్రహించడం.. అంటే ఏమిటి… ఏయ్ ఎవరూ బయట నోరు మెదపవద్దు… సీనియర్లనే ఉపేక్షించడం లేదు.. చిన్నా చితకా చేపలను అసలే వదిలేది ఉండదు… వేపుడే  అనే హెచ్చరిక… మనం పిల్లలు అల్లరి చేస్తున్నపుడు ఏమంటా… పెద్దవారిని గట్టిగా కోప్పడినట్టు నటిస్తాం. దానితో తక్కిన చిన్న పిల్లలు గప్చిప్ అయిపోతారు. ఇదే రూట్ లో వెళుతున్నారు చంద్రన్న…  కావాలంటే ఈనాడులో పైన బాక్స్ ఐటమ్ వార్త – ఎలాంటి నిర్ణయం లేకుండానే ఆ వ్యాఖ్యలేంటి? – చూడండి… మరి ఎలాంటి నిర్ణయం లేనపుడు ఒకే రోజు వ్యవధిలో అంత సీనియర్ మంత్రులు, నాయకులు ఇద్దరు మీడియా ముందు నోరు విప్పుతారా. ఏం బాబు… పెజలు అంత అమాయకంగా కనిపిస్తా ఉంటారా….  ఇదిగో ఆ కథనం చూడండీ…

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన ఆందోళన చెందుతున్నారు. పార్టీ క్రమశిక్షణ గాడి తప్పుతుందని ఆయన సన్నిహిత మంత్రుల వద్ద ఆవేదన చెందారు. ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అసహనాన్ని ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పొత్తులపై ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రజానాడిని తెలుసుకునేందుకే ఆయన ఫిల్లర్స్ ను వదులుతారు. చంద్రబాబుకు ఇది ఎప్పుడూ అలవాటే. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే లీకుల ఆధారంగా పత్రికల్లో కథనాలు ప్రచురితమవుతుంటాయి. ఇటీవల సీనియర్ నేతలు, మంత్రులతో సమావేశమైన చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు విషయమై ప్రస్తావించారు. అదీ తెలంగాణాకు సంబంధించి మాత్రమే. తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు జరుగుతుండటంతో ఒంటరిగా అక్కడ బరిలోకి దిగడం కష్టమని భావించిన చంద్రబాబు అక్కడ పొత్తుతోనే వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఏ పార్టీతో పొత్తు ఉంటుందన్నది స్పష్టం చేయలేదు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సంప్రదించిన తర్వాత దీనిపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని ఆయన ఆ సమావేశంలో చెప్పారు. కాంగ్రెస్ తో పొత్తుకు చంద్రబాబు సిద్ధమేనంటూ కథనాలు ప్రచురితమయ్యాయి. నిజానికి చంద్రబాబు గత కొంతకాలంగా కాంగ్రెస్ తో సన్నిహితంగానే ఉంటున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకోసమే కాంగ్రెస్ కు కొంత దగ్గరగా జరిగారు. అయితే చంద్రబాబు పొత్తులపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే సీనియర్ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు నిర్ణయం జరిగిపోయినట్లు మాట్లాడారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని వారు హెచ్చరించారు. తమ కాళ్లు పట్టుకున్నా కాంగ్రెస్ తో పొత్తుకు అంగీకరించే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ వెంపర్లాడటం లేదని ఆ పార్టీ నేత తులసీరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గతంలో చంద్రగిరిలో చంద్రబాబును అనేకసార్లు ఓడించామన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఎన్టీఆర్ ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందని మరచిపోదన్నారు. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలవ్వడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. తాను పొత్తులపై ఎటువంటి నిర్ణయం తీసుకోక ముందే మంత్రులు అలా మాట్లాడటం సరికాదన్నారు. తాను వారిని పిలిపించి మాట్లాడాలనుకుంటున్నట్లు చంద్రబాబు నేతలతో చెప్పారుట…  ఇదబ్బా కథ,

ఇంతజరుగుతోందంటే… చాపకింద నీరులాగా వ్యవహారం ముదిరి పాకాన పడుతోందన్నమాటే… మరేం అనుకోకండి కే.యీ, అయ్యన్న గారూ… మీరిద్దరు ఆటలో అరటి పండ్లు అంతే… సో బాబును సరిగ్గానే ఫాలో అవుతున్నామన్నమాట…. గుడ్ లక్.

షరా… అవునూ ఆరో పెళ్లి అంటూ విషయానికి కాకెక్కించిన సాక్షి తీరా ఈనగాచి నేలపాలు చేసినట్టు… ఇవ్వాళ..  వార్తను ఎక్కడో గుట్టు చప్పుడు కాకుండా దాచి నట్టు నాలుగో పేజీలో వేసుకుదేమిటి చెప్మా….

 

మామాట:  కానీయండి ఎవరి ఆటలు వారివి… ఇంకా ఏడాది ఉందిగా…

Leave a Reply