ఆటలో అరటి పండా… ఏమిటి?

Share Icons:

 

తిరుపతి, ఆగష్టు24,

శుక్రవారం (24.08.18) తెలుగు దినపత్రికలు చూచినపుడు ఒకే వార్తను రెండు భిన్న దృవాలైన పత్రికలు ప్రముఖంగా ప్రచురించడం ఆసక్తి కలిగిస్తుంది. ఈనాడు మొదటి పుటలో కాంగ్రెస్తో పొత్తుకు ససేమిరా అనే వార్తను వేయగా, సాక్షి పత్రిక కూడా ఇదే వార్తను మరింత వివరంగా  టీడీపీలో కాంగ్రెస్ పొత్తు ముసలం అనే వార్తగా ప్రచురించింది. ఆంధ్రజ్యోతి పత్రిక 11వ పేజీలో కాంగ్రెస్ తో కలిస్తే ప్రజలు బట్టలూడతీసి తంతారు అనే శీర్షికతో వార్తను ప్రచురించింది.  సాక్షి పేర్కొన్నట్టుగా నిజంగా ఇది ముసలం అన దగ్గ సీరియస్ అంశమేనా…

ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంత మొండిగా ఉన్నారో తెలియక తెలుగుతమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. చివరకు ఎలాగో ఇద్దరు సీనియర్ మంత్రులు విజిల్ బ్లోయర్ పాత్ర తీసుకున్నట్టున్నారు. తెలుగు దేశం కాంగ్రెస్ తో కలిస్తే తాము పార్టీ వీడుతామని ప్రకటించే వరకు వీరు వెళ్లారు. అంటే పార్టీలో ఏదో జరుగుతోందన్నమాట. ఎన్నికల్లో పొత్తుకోసం అధినాయకత్వం బలంగానే పావులుకదుపుతోంది. నిన్న అపస్వరం పలికిన వారిలో కేయీ చాలా సీనియర్. చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే నేత. ఇద్దరూ సమకాలికులు కూడా మరి కేయీ బాబు నిర్ణయాన్ని వ్యతిరేకించడం, దానిని బహిర్గత పరచడం కాస్త ఆచ్చర్యంగా అని పిస్తోంది. నిన్న మనం అనుకున్నట్టు ఇది కూడా బాబన్న ఆడుతున్న నాటకం కాదు కదా, ఈ రెండు గొంతులు బయడపడడంతో తక్కిన వారు కూడా స్వరం పెంచుతారు. అపుడు ఆ వ్యతిరేక స్వరాలు గుర్తించి ఎన్నికలనాటికి వారి మాటకు విలువ లేనివిధంగా ఒక వాతావరణం సృష్టించడానికి కూడా చంద్రబాబు ప్రయత్నించి ఉండొచ్చనిపిస్తోంది. ఎందుకంటే, ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అంటూ పెద్దగా ఏమీ లేదు. గతం లో  పార్టీలో చక్రం తిప్పిన చాలా మంది ఇపుడ ఆ పార్టీలో లేరుకదా… విభజన తరువాత కాంగ్రెస్ అడ్రస్ చెప్పేవారే లేదు. ఇపుడు ఏపీసీసీలో ఉన్నవారు చాలా కొద్దిమంది, వారికీ రాష్ట్రంలో పెద్ద విలువ లేదు వారు పెద్ద స్థానిక నేతలే.. అంతే.. మరి ఇపుడు కొత్తగా తెలుగు దేశం కాంగ్రెస్ తో కలవడం ఏమిటంటే… సాంకేతికంగానే… పోటీలో సర్థుబాటు కోసం… అంతే తప్ప ఏపీ లో కాంగ్రెస్ తెలుగు దేశం వైసీపీ అంటూ తేడాలేదు. వైసీపీలో గెలిచిన వారు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులుగా చేయడానికి అంగీకరించిన అంతరాత్మ(కేయీ, అయ్యన్నల వి) కాంగ్రెస్ లో కలవడానికి అంగీకరించకపోవడం ఏమిటి విడ్డూరం కాకపోతే..  కాంగ్రెస్ తో కలిస్తే అంతకు మించిన దుర్మార్గం  ఉండదన్న అయ్యన్న మిగతా దుర్మార్గాలనెట్లా సహిస్తున్నారో అనే అనుమానం సామాన్య ప్రజకు కలగk మానదు. అందువలననే ఇదో నాటకమా అనే సందేహమూ  వస్తోంది.

చంద్ర బాబు అమలుచేస్తున్న స్లోపాయిజన్ పథకంలో ఇదో అంకంగా భావించాలా ఏమో.. చూద్దాం. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పెద్దగా లేదు. విభజన తరువాత తెలంగాణలో కాస్త క్యాడర్ తప్ప పచ్చజండా వనరులు చాలావరకు టీఆర్ఎస్ లో కలిసిపోయిన విషయం తెలిసిందే.  అందువలన బాబు కూడా పెద్దగా బేధం పాటించడం లేదేమో… అంతిమంగా ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా రాజకీయం నడుపుతున్నట్టుంది. అలాంటపుడు ఇక నైతిక ధర్మాలకు  ఈ ఆటలో తావుండదు.

 

మామాట : ఆటలో దిగినతరువాత నో రూల్స్ అన్నది బాబు రూల్…

Leave a Reply