ఏవీ సుందర నగరాలు?

Share Icons:

 

తిరుపతి, ఆగష్టు 14,

మంత్రిగలవాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలచుఁ దరచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపుఁగీలూడినట్లు జరుగదు సుమతీ!

తాత్పర్యం: సమర్థుడైన మంత్రి ఉంటే సామ, దాన, భేద, దండ వంటి ఉపాయాలు పాడుకాకుండా సాగిపోతాయి. అలాంటి మంత్రి లేకపోతే కీలూడిపోయిన యంత్రంలా పాలన ముందుకు సాగదు.

సుమతి శతక కారుడు ఈ పద్యాన్ని ఎప్పుడో క్రీ.శ. 1200 ఆ ప్రాంతంలో రాసి ఉండవచ్చు… అంటే ఇప్పటికి 800 సంవత్సరాల క్రితం.  కానీ  పద్యం కొన్ని దశాబ్దాల క్రితం వరకూ తెలుగువారందరూ పాఠశాల చదువులో భాగంగానో, పెద్దబాలశిక్ష లోనో చదువుకొనే ఉంటారు. ఇప్పుడంటే ఇంగ్లీషు చదువు గానా ఓ 50 యాభై ఏళ్లకు ముందు… అంతా  సంప్రదాయ చదువే ఉండేది. ఇదంతా ఎందుకంటే.. పద్య భావం ఏమిటంటే మంత్రి విహీనత పై శతకకారుడు చెప్పింది నేటికీ వర్తిస్తుంది కనుక. మంచి మంత్రి, మంత్రాంగం లేక పోతో బతుకు పార్టు పోయిన ఇంజన్ లా ఎందుకూ పనికిరాకుండా పోతుందనేది.

వర్తమానంలోని తెలుగు మీడియా ధోరణి  చూస్తున్నపుడు తరచుగా ఈ పద్యం మదిలో మెదులుతూ ఉంటుంది. సరైన మంత్రాంగం లేక మన మీడియాకి కూడా మార్గదర్శనం లోపించినట్లుగా ఉంది. నిత్యం ఉషోదయంతో సత్యం అనే పత్రిక కూడా అసత్యాలను అర్థసత్యాలను విచ్చలవిడిగా వండి వారుస్తుంటే అలాగే అనుకోవాల్సి వస్తోంది. మంత్రి అని సుమతి శతక కారుడన్నిది కేవలం మనిషినే కాదు…. మతి దొబ్బితే కూడా మనం చేసే పనుల్లో డొల్లతనం తప్ప మరేమీ ఉండదు. విచక్షణ కూడా మంత్రి స్థానంచో ఉంచదగిందే అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. అట్లా చూసినపుడు ఇదిగో ఈ పత్రికల రాతలన్నీ మూలగ లోపించిన వ్యవహారంగా కనిపిస్తున్నాయి.

మంగళవారం (14.08.18) ప్రముఖ తెలుగు దినపత్రికల్లో కనిపించిన వైవిధ్యం వింత వైనాలుపోయింది. ఈనాడు పతాక వార్తగా స్వచ్ఛ భాగ్యం తిరుపతి నివాస యోగ్యం అనే వార్త వేసింది. దేశంలోని నివాసయోగ్య నగరాల వివరాలను  కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సోమవారం విడుదల చేసింది. ఇందులో ఏపీకి చెందిన తిరుపతి, విజయవాడ పట్టణాలకు  ఉత్తమ పది స్తానాలలో చోటు దక్కిందట… మరి తక్కిన నగరాల మాటేమిటి. రాష్ట్రంలో ఉన్న నివాస ప్రాంతాలు ఎన్ని… అందులో రెండు నివాస యోగ్యమైతే… మిగతావి ఏమిటి… అక్కడ వర్థిల్లుతున్న ఏలినవారి మురుగు, పారిశుధ్యలేమి, దుర్భర జీవన పరిస్థితులు ఎందుకు మారవు, పెద్ద పట్టణాలే కాదు ఏజన్సీ వంటి ప్రకృతి మధ్య ఉండే నివాస ప్రాంతాలలో మౌళిక వసతులు ఉన్నాయా.రోగాలు, జబ్బులతో, ప్రసవసమయ ఇబ్బందులతో, అంటు వ్యాధులతో ఎందరు గ్రామీణులు ఏటా మరణిస్తున్నారో లెక్కలున్నాయా… మరి రెండు నగరాలు మేలైనవే అనుకుందాం… అక్కడైనా అంతా బాగుందా… మీకో ఉదాహరణ చెబుతా… కొద్ది వారాల క్రితం వరకూ చిత్తూరు కలెక్టర్  లేదా ఇతరుల, బహుశా డిపి ఆర్ వో అనుకుంటా … ఫేస్ బుక్ అకౌంటు నుంచి నాకు వార్తలు వచ్చేవి. అలా తిరుపతి సుందర నగరం స్మార్ట్ సిటీ  అవార్డు గెలిచిందని ఓ రోజు కొన్ని ఫోటోలతో సమాచారం వచ్చింది. వెంటనే నేను దానికి కామెంట్ పెడుతూ.. తిరుపతి అంటే కొత్తగా వేసిన రెండు మూడు బైపాస్ రోడ్లు మాత్రమే కాదు. పాత పట్టణంలో పారిశుధ్యం అత్యంత దారుణంగా ఉంది అంటూ కోన్ని వీధుల పేర్లు చెప్పి, అక్కడి ఫోటోలు కూడా పెట్టండి… ఎందుకీ ఆత్మ వంచన అని రాశాను… ఆ రోజు నుంచీ సదరు ఫేస్ బుక్ పేజీ నాకు కనిపించడం లేదు. ఇలా ఉంటుంది అధికారుల నిర్వాకం. ఊరికి బయట ఉండేవి. విఐపీలు వెళ్లే ఒకటి రెండు మార్గాల ఫోటోలు పెట్టి, అవే సుందర నగరాలు అంటూ ప్రపంచ బ్యాంకు లేదా విదేశీ సంస్థల అధికారులను మోసపుచ్చినట్టే ప్రజలనూ ఏమార్చాలనుకుంటున్నారు. కాకపోతే పత్రికలు కూడా  పాలకులకు వంతపాడడమే విడ్డూరం. రాష్ట్రంలో చెత్త పట్టణాలు అనే వివరాలు ఇస్తే మన పాలకుల బండారం బయట పడపతుంది కదా. ఏమంటారు కాదంటారా….

మామాట :  పిల్లి కళ్లుమూసుకుని పాలుతాగుతున్నట్టుంది వ్యవహారం

Leave a Reply