ఇదేం స్వేచ్ఛ – ఇదేం మీడియా

Share Icons:

తిరుపతి, ఆగష్టు 11,

పత్రికలు ప్రజల పక్షం వహిస్తాయని సామాన్యంగా అందురూ అనుకుంటారు. మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో విలువల మనుగడకు ప్రజలకు అండాదండా అందించేది పత్రికలనే నమ్మకం ఉంది. ప్రజాపరిపాలనలో అతి ముఖ్యమైనది  రాజ్యాంగం. పౌరుల రాజ్యాంగ హక్కులను నిరంతరం పరిరక్షించవలసింది పత్రికలే. ఇందులో సందేహం లేదు.

According to the United Nations, “a free, uncensored, unhindered press or other media is essential in any society to ensure freedom of expression.” This course examines the way human rights and media – particularly journalism – are linked, both by tracing historical developments and discussing contemporary issues. 

భావ వ్యక్తీకరణ హక్కు సక్రమంగా అమలుకావడానికి, స్వేచ్ఛ, నియంత్రణ లేని, అడ్డంకులు లేని మీడియా  ఏ సమాజానికైనా అత్యావస్యకం అని ఐక్యరాజ్యసమితి (యూఎన్) అభిప్రాయపడింది. స్వేచ్ఛా పాత్రికేయం ద్వారానే పౌరుల మానవ హక్కులు సంరక్షించబడుతాయని యూఎన్ నమ్ముతోంది. మరి ఇవ్వాళ దేశంలో స్వేచ్ఛ ఉన్న పత్రికలు ఎన్ని. ప్రతి మీడియా సంస్థా.. ఏదో ఒక బంధనంలో చిక్కుకోలేదా. అది అధికారం కావచ్చు, ప్రాంతీయ వాదం కావచ్చు, మతం, కులం, వర్గం లేదా సంపాదనల కోసం విధి నిర్వహణలో రాజీ పడడం అంటే స్వేచ్ఛను కోల్పోయి… నియంత్రణలోకి వెళ్లిపోవడమే కదా.

శనివారం (11.08.18)  నాలుగు తెలుగు ప్రధాన దిన పత్రికలు చూద్దాం… ఈనాడులో  మొదటి పుట పైన రెండు శాస్త్రీయ అంశాల వార్తలు ఇచ్చారు. వాటికి దిగువన రూ. 350 కోట్లతో తిరుపతిలో పై వంతెన అనీ మహాక్రతువుకు నేడే శ్రీకారం అనే వార్త ఉంది. అటు పక్కగా అన్నింటికీ భారతే అనే వార్త ఇచ్చారు. దిగువన మరో వార్త పీడీ ఖాతా… ఏమా కథ? అనే సమాచారం ఇచ్చారు.  సాక్షి పత్రికలో  ప్రధానంగా నన్ను వేధిస్తున్నారు… నా కుటుంబాన్నీ టార్గెట్ చేస్తారా? అనే జగన్ వార్త ఉంది. దిగువన అధికారం అండగా కబ్జా కాండ , రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాలు చెరబట్టిన టీడీపీ నేతలు అనే వార్త ఉంది. ఇక ఆంధ్రజ్యోతిలో  ప్రధానంగా మెడిసన్లో డేంజర్ మార్కు మెడికోలతో ప్రొఫెసర్ల ఆటలు అనే వార్తాకథనం, నిర్ఘాంత పోయా అని జగన్  వార్త తో పాటు నేటి నుంచే మహాక్రతువు అనేవి ఉన్నాయి.  నమస్తే తెలంగాణలో  ఐదు కోట్లతో పద్మశాలి భవన్, మెగాసిటీగా హైదరాబాద్ వంటి వార్తలున్నాయి. ప్రభుత్వం మారే వరకూ నమస్తే తెలంగాణలో ప్రజా సమస్యలు కనిపించే దారే లేదు. టీఆర్ ఎస్ అధికారం కోల్పోతే అపుడు ఈ పత్రికలో వార్తలను గమనించాల్సి ఉంది. అపుడన్నీ ఇలానే జేజేలుంటాయా… ఛీత్కారాలు పెరుగుతాయా చూడాలి.

ఇవ్వాళ రెండు అంశాలు చూద్దాం. ఒకటి  మొన్ని ఈడీ ఛార్జిషీట్లో జగన్ సతీమణి భారతి రెడ్డి పేరు చేర్చడం. కొన్ని పత్రికలు గురువారం ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించడం చూశాం. మరికొందరు పట్టించుకోలేదు. దీనిపై ప్రతిపక్షనేత, వైఎస్సా ఆర్ సీపీ సారథి జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు సంవత్సరాల క్రితం కేసుల్లో ఇపుడు నా కుటుంబ సభ్యులను కూడా చేర్చి మమ్మలను వేధిస్తున్నారని లేఖ రాశారు. ఇటీవల మనం చర్చించుకుంటున్నట్టే… పత్రికలు తమకు అనుకూలమైన అంశాలను  మాత్రంమే వార్తలుగా భావిస్తున్నాయి. ఇవ్వాళ అదే జరిగింది. జగన్ స్వంత పత్రిక సాక్షి ఈ అంశానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి, పతాకవార్తగా వేసుకుంది. మరే పత్రికా అంతగా స్పంధించలేదు. అదే సమయంలో ఈనాడు పత్రిక జగన్ కు నష్టం కలిగించే విధంగా అన్నిటా భారతీనే అనే వార్తను ప్రముఖంగా, విపులంగా ప్రచురించారు. అన్నీ నువ్వేచేశావు నాన్నా అని బొమ్మరిల్లు సినిమా హీరో అన్నట్టు…. అన్ని భారతి రెడ్డికి తెలిసే జరిగాయనీ, ఆమె సంతకాలు కూడా చేసేదనీ ఈనాడు విపులీకరించింది. పత్రికలకు ఎందుకింత మొహరింపు (పోలరైజేషన్) అన్నదే ఇక్కడ నా ప్రశ్న. ఇది పత్రికా స్వేచ్ఛగా మనం భావించ వచ్చా… ఇటువంటి అంశాలను పేజీలకు పేజీలు ప్రముఖంగా ప్రచురించడం ద్వారా సదరు పత్రికలు సాధిస్తున్న పౌరన్యాయం ఏమిటన్నది సమాజం ఆసక్తిగా గమనించే అంశం. రెండోది.. ఈనాడులోనే బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రస్థావించిన పిడి అకౌంట్లపై  సవివర మైన వార్త  పీడీ ఖాతా… ఏమా కథ ? ఇవ్వడం అంటే పత్రిక అటు జగన్ కు నష్టం చేయాలనీ, ఇటు పాలక తెలుగుదేశానికి ఉపకరించాలనీ ఎంతగా తాపత్రయపడుతోందో నేడు మనం చూస్తున్న రెండు వార్తల ద్వారా తెలుసుకోవచ్చు. ఇదే నా స్వేచ్ఛ, నియంత్రణ లేని, అడ్డంకులు లేని మీడియా హక్కుల ప్రతిఫలం అనేది సగటు పౌరునికి కలుగుతున్న అనుమానం.

 

మామాట :  మోహావేశంతో మోహరించడం మీడియాకు పాడియా..?

Leave a Reply