రెటింగ్ మాయాజాలంలో మీడియా!

Share Icons:

తిరుపతి, ఆగష్టు 06,

Unfortunately, when it comes to the Indian media…it is not solely about money or kickbacks. Sometimes it is just about viewership, airtime and seeing your face on TV.  The biggest problem that is currently plaguing the Indian media (for which the viewer bears the brunt) is the in-fighting that has come at the heels of an all-out TRP war. In fact, the media channel and their personnel seem to be more interested in taking a pot shot at each other than hard-hitting news pieces. In fact, this journalistic jealousy has made journalists lose their journalistic focus, with each using the screen as his/her personal billboard, with little regard for news or views.

ఇది దేశమంతా మీడియారంగంపై వినిపిస్తున్న అభిప్రాయం. కేవలం రేటింగ్ పెంచుకోవడమనే ఆటలో మునిగి తేలుతున్న మన మీడీయా మంచి చెడ్డల విచక్షణకోల్పోయింది. బహుశా పత్రికలు కూడా ఇదే దారిలో వెళితున్నట్టు అనిపిస్తోంది. ప్రతి పార్టీ  ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒక పత్రిక నడుపుతోంది. కనుక దాని ఉద్దేశం సంబంధిత రాజకీయ అనుకూల భావాలున్నవారే తమ పత్రిక చదువుతారు. తటస్థ పాఠకుల సంఖ్య తక్కువ, లేదా తులనాత్మక పఠనంకోసం చదివే వారు ఎలాగూ చదువుతారు అనే భావనతో నిజాలు కాకుండా, కేవలం తాము మద్దతు ఇస్తున్న పార్టీల అబిమానులను సంతృప్తి పరచే విధంగా వార్తలు వండి వారుస్తున్నారు.

సోమవారం (06.08.18) ఈనాడులో వైవిధ్యం కనిపించింది. పతాక వార్తగా ఇజ్రాయిల్ నీటి ఎద్దడి నివారణ పధకంపై ఒడిసి పట్టిన చోటే నేల వట్టిపోతే.. అనే వార్త ఇచ్చింది. దాని దిగువన కూడా ప్రత్యేకాధికారుల కోసం పైరవీ అనే వార్త ఉంది. ఇక ఆమె చేయి తిరుగుతోంది అన్న వార్త రాజకీయ రంగున్న వార్తే… ఎన్నికల సంవత్సరంలో ప్రభుత్వం పనితీరు అమోఘంగా ఉంది, మహిళలు వేలాదిగా ఉద్యోగాలు పొందుతున్నారు అని పరోక్షంగా చెప్పడం ఈ వార్త ధ్యేయం. అదే విధంగా ఇవ్వాళ పత్రికలో రాజకీయ దుర్గంధం కంటే వివిధ రకాల సమాచారం ఇచ్చారు. సాక్షి పత్రికలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల ఫీజులు తగ్గిస్తాం అన్న జగన్ హామీని ప్రముఖంగా ప్రచురించారు. అటు పక్కగా చర్చలు విఫలం అని 108 వాహన సేవలపై వార్త ఇచ్చారు. ఇటువంటి వార్త ఈనాడు, జ్యోతిలో రావడం లేదు. ఇక బిజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్  బ్యాంకు ఖాతాల ఆరోపణపై  ఈనాడులో కుంభకోణం అనడం అజ్ఞానం అంటూ వార్త రాగా సాక్షిలో టీడీపీ నేతలు దొంగల్లా తప్పించుకుంటున్నారు అనే శీర్షికతో జీవీఎల్ వివరణ ప్రచురించారు. ఈ రెండూ చూసినపుడు పైన మనం అనుకున్నట్టు, ఏ పత్రిక అభిమానులకు కావలసినట్టుగా ఆ పత్రిక వార్తను వండుతోందని స్పష్టం అవుతూ ఉంది. ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో పతాక వార్తలు ఇలా ఉన్నాయి,.. ఏఐ @ ఏపీ,  కృత్రిమ మేధస్సుకు సర్కారు పెద్ద పీటవస్తోంది హోలీటెక్, అనే పాజిటివ్ వార్తలున్నా., దాని పక్కనే కేంద్రను బద్నాం చేసే విధంగా న్యాయముర్తి జోసెఫ్ నియామక వివాదాన్ని జస్టిస్ జోసెఫ్ జూనియర్  అని ప్రముఖంగా రాశారు.  పివి సింధు ఫైనల్లో పతకం కోల్పోయిందన్నది అందరూ ప్రముఖంగానే ప్రచురించారు. నమస్తే తెలంగాణ పత్రికలో మామూలే జయశంకర్ జయంతి, చిల్లర లూఠీలు, మెతుకు సీమలో భాగీరథి వంటి తెలంగాణ ప్రభుత్వానికి మైలేజీ పెంచే వార్తలే కానీ రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకలు ఏవీ వార్తలుగా చోటు చేసుకోలేదు.

జ్యోతి చివరి పేజీలో  రోజు మరో వార్త మన దృష్టి నుంచీ తప్పించుకోవడానికి చూస్తోంది… అదే మంటే.. ఆ అబద్ధం వెనుక  అంటూ రైతులతో ప్రధాని మోదీ భేటీ లో కొత్త కోణం కింద రెట్టింపు ఆదాయం వస్తోందని మహిళా రైతులతో ఊరకే చెప్పించారనే వార్త. అందుకు సంబంధించి సదరు టీవీ ఛానల్ ఏబీపీ ఎడిటర్ రాజీనామా వివరాలున్నాయి. ఇదీ నేడు నడుస్తున్న వైనం. ప్రభుత్వాలు ఏ మాత్రం వ్యతిరేకతను, ప్రతికూల వార్తలను ఇష్టపడడం లేదు. వెంటనే పార్టీ మీడియా ప్రతినిధులు సదరు పత్రిక, టీవీ ఛానల్ కి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. చెప్పిన మాట వినకపోతే శంకర గిరి మాన్యాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పాలక పక్షాలకు ఇచ్చగించని వార్తలు రాసే వారిని, ప్రసారం చేసే వారిని వెనువెంటనే శిక్షిస్తున్నారు.  కక్షగట్టి వెంటాడి, వేటాడుతున్నారు.

ఈ రాజ్యం ఇలా వ్యవహరిస్తున సమయంలో పత్రికలు-నాణ్యత అంటూ నీతి వాఖ్యాలు వల్లించడం సామాజిక మాధ్యమాలలోనే వీలవుతుంది ఆచరణలో వీలుకాదేమో…

 

మామాట: పత్రికలు , మీడియా  దొందూ దొందే అన్న రీతిలో ఉన్నాయి…

Leave a Reply