నేతిబీర చందంగా మీడియా

Share Icons:

 

తిరుపతి, ఆగష్టు 04,

In words of Benito Mussolini –

“Democracy is a kingless regime infested by many kings who are sometimes more exclusive, tyrannical and destructive than one, if he be a tyrant”. It is the fear of being exposed by the media before the public that most of the politicians keep themselves under control to some extent

బింటో ముస్సోలినీ ఇటలీకి చెందిన రాజకీయనేత. ఆయన చెప్పిందే ఇక్కడి ఇటలీ వారు వినడం లేదు. సోనియా పరిపాలనలో కూడా పత్రికలకు పెద్దగా స్వేచ్ఛలేదు. అంతకు ముందే పార్రంభమైన పతనం ఇంకా వేగంగా దిగజారింది పదేళ్ల యూపీఏ పాలనలో…

మొత్తానికి భారతీయ రాజకీయాలు పత్రికల ప్రాముఖ్యాన్ని గణనీయంగా తగ్గించివేశాయి. పత్రికలను నమ్మకండా ఉండే విధంగా ప్రజలను పార్టీలు సిద్దంచేశాయి. ఇపుడు మీడియాలో వస్తే భయపడవలసిన పనిలేదు. ఉదాహరణకు బోఫోర్స్ విషయం పత్రికల్లో వచ్చినపుడు దేశంలో అదో చర్చనీయాంశంగా ఉండేది. కాని నేడు రఫెల్ విమానాల డీల్ పార్లమెంటును కుదిపినా పట్టించుకునే పత్రికలు లేవు. ఎందుకు ఇలా జరుగుతోందంటే.. మనకున్న పత్రికలు గ్రూపులుగా విడిపోయాయి. పాలక పక్షంలోని పత్రికలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయవు. ప్రతిపక్షంలోని పత్రికలు రాస్తే ప్రజలు పట్టించుకోరు. ఎందుకంటే అవి కూడా ఏదో ఒక రాజకీయపార్టీ గొడుగు కింద నుంచీ పనిచేస్తున్నాయి కనుక… ఆ పార్టీ పత్రికలు అలానే రాస్తాయిరా… అన్నది జనబాహుళ్యంలోకి వెళ్లిపోయింది. నిజంగా ఒకటి అరా పత్రికలు నిజాయితీగా వార్తలు రాసినా ప్రజలు నమ్మడం లేదు. ఎందుకంటే అవీ ప్రకటనలు రావడంలేదనీ, ఫలానా కులం, వర్గం కదా అలాగే రాస్తాయిలే అనీ నేతలు ప్రజలను నమ్మించడం వలన. పత్రికలు ఉండాలి, అవి రాసేది ఎవరూ నమ్మకూడదు ఈ విధానంతో రాజకీయాలు నడుస్తున్నాయి.

శనివారం (040818) నాలుగు ప్రధాన దినపత్రికలలో పెద్దగా సంచలనాలు లేవు. ఈనాడులో  గోరీ కట్టిన క్వారీ అని కర్నూలు జిల్లాలో ప్రమాద వార్త,  సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జోసెఫ్, పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా ఉండాల్సిందే అనే వార్తతో పాటు సీఎం పర్యటనలో భాగంగా కేంద్రం నుంచీ వడ్డీతో సహా రాబడతా అనే వార్త ఉంది. సాక్షి పత్రికలో క్వారీలో భారీ పేలుడు పతాక వార్త కాగా, దాని కింద తెలుగుదేశం నేతల అక్రమ క్వారీ అంటూ ట్యాగ్ ఇచ్చారు.  సాక్షి పత్రిక పేర్కొన్నట్టు అధికార పార్టీ వర్గీయులు నిబంధనలకు వ్యతిరేకంగా క్వారీ నిర్వహించడం నిజమే అయితే… అటువంటి విషయాన్ని ప్రస్తావించకుండా వార్తలు రాసిన తక్కిన పత్రికలు ప్రజలకు అన్యాయం చేస్తున్నట్టే కదా. ఇంకా ఉక్కు ఉద్యమంపై విరిగిన లాఠీ, భారీగా పడిపోయిన నిమ్మ అరటి ధరలపై సాక్షి వార్తలు ప్రచురించింది.  ఆంధ్రజ్యోతి లో బతుకులు బుగ్గి అంటూ పేలుడు వార్త ఇచ్చారు దిగువన క్వారీ ప్రమాదంపై భిన్నకథనాలు అనే ఉపశీర్షికలు ఇచ్చారు.  కుట్రదారులను నిలదీయండి అన్న సీఎం వార్త, ఆధార్ నెంబర్ల లీక్ వార్తలు ఇచ్చారు. అలాగే దిగువన మీ నిర్వాకంతో మచ్చ అంటూ జిల్లా యంత్రాంగం పనిచేయడం లేదని ఉప ముఖ్యమంత్రి చేసిన  వ్యాఖ్యలు ప్రచురించారు.  నమస్తే తెలంగాణ పత్రికలో అన్నీ ప్రభుత్వాన్ని ప్రశంసించే వార్తలే ఉన్నాయి. దక్షిణాదిలో నెం.1 అనే వార్త,  సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వార్త, పల్లెకు జలసిరి వంటి మైలేజీ పెంచే వార్తలే ఉన్నాయి. ఇది రోజూ ఉండేదే.

Media act as a catalyst for democracy and development, helping to make public participation meaningful .If media is honest and committed in its job, democracy is bound to function more efficiently and the loopholes present in any democratic system can certainly be plugged to the fullest satisfaction of the people. On the contrary, if media is biased, corrupt and favours only a particular party or few individuals, it can prove to be very dangerous for the smooth functioning of democracy. No one can become perfect and one can only strive to become so. The same holds true for our media also. Certainly there is still a lot of scope for improvement by which the media can rise upon the aspirations of the people for which it is primarily meant.

ఈ భావన ఇపుడు పాత్రికేయంలో కనిపిస్తోందా అన్న ప్రశ్న వేసుకున్నపుడు చాలా విచారం కలుగుతుంది.  ప్రజాస్వామ్యం, అభివృద్దికి మీడియా ఒక వాహిగా ఉపకరిస్తుందని నాడు భావించారు. మీడియా తన పాత్ర సక్రమంగా నిర్వహించిన నాడు ప్రజాస్వామ్యం మరింత సమర్ధవంతంగా వెలుగొందుతుందన్నారు. అదే సమయంలో మీడియా ఒక వర్గానికి, వ్యక్తులకు, పార్టీకీ వంత పాడే బాకా పుచ్చుకుంటే, దురుద్దేశాలతో పనిచేస్తే ప్రజాస్వామ్యానికి అది అత్యంత ప్రమాదకరమన్నారు.  ఎవ్వరూ వంద శాతం సక్రమంగా ఉండరు. ఇది పత్రికలకు కూడా వర్తిస్తుంది కానీ పత్రికలు ఇంకా మెరుగుపడడానికి, ప్రజల ఆకాంక్షలమేరకు పనిచేయడానికి చాలా గట్టికృషి చేయవలసి ఉందన్నది నిజం.

ముస్సోలినీ అంటారు… Democracy is beautiful in theory; in practice it is a fallacy. You in America will see that some day.

కాగితం పై అందంగా కనిపిచే ప్రజాస్వామ్యం, వ్యవహారంలోకి వచ్చేటప్పటికి తేలిపోతుంది. అమోరికాలో త్వరలోనే అది జరుగుతుందన్నారు.. అమెరికానే కాదు…. మన భారతదేశంలో కూడా ఆచరణలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కొటిగట్టడం ఎపుడో ప్రారంభమైంది.

మామాట: పత్రికలు విలువలు నేతిబీరలో నేయిలాగా మారాయి.

 

Leave a Reply