ఒకే వార్త -వివిధ రుచులు

Share Icons:

 

తిరుపతి, జూలై 28,  ఇటీవల జాతీయ ప్రెస్ దినోత్సవం సందర్బంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించివ కార్యక్రమంలో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ…   “Credibility is becoming a rare commodity,” the former information and broadcasting minister said. “One does not know what to believe. Reporting on the same event, one newspaper declares there was massive gathering, while another carries pictures of empty chairs.”  The media is losing its credibility in the pursuit to sensationalise news, Vice President Venkaiah Naidu.  అన్నారు.

తెలుగు ఒక ప్రాంతీయ భాష. భారత దేశంలో ఉన్న అనేక భాషలలో అదీ ఒకటి. ఒకనాడు దేశంలో తెలుగు మాట్లాడేవారు రెండవ స్థానంలో ఉండేవారు. కానీ నేడు ఆరవ స్థానానికి దిగజారిపోయారు. ఇది స్వయంకృతం. సరే తెలుగు రాయడం, చదవడం రాకపోతే తెలుగు దినపత్రికలను ఎవరు చదువుతారు, మీ ఉద్యోగాలు ఏమౌతాయి.. అని నేను మా యువ పాత్రికేయ మిత్రులను అడుగుతూ ఉంటాను. అందుకు వారు చూద్దాం సార్… అనే పొడి సమాధానంతో దాటవేస్తూ ఉంటారు. సరే ఇటీవల  భారత ఉపరాష్ట్రపతి పైన చెప్పిన విషయాన్ని చూశారు కదా.. అందులో నిజం లేదా..  తెలుగులో వెలువడుతున్న నాలుగు ప్రధాన పత్రికలు (సర్కులేషన్ దృష్ట్యా) ఏకరీతిగా వార్తను ప్రచురించి ఎంతకాలమైంది. ఎర్రజాబిలికి గ్రహణం  వంటి విశేషాలు కాదు… రాజకీయవార్తలలో సారూప్యత కనిపిస్తోందా?  కనీసం బంద్ కు సంబంధించిన వార్తలోనైనా సామరస్యం ఉంటోందా…?

శనివారం వెలువడిన నాలుగు ప్రధాన తెలుగు దినపత్రికలను  ఓ సారి చూద్దాం.  ఈనాడు మొదటి పుటలో ఎర్గజాబిల్లి వార్త, లారీలు రయ్ రయ్, తరువాత చిరుద్యోగులకు తీపి కబురు అనే వార్తలున్నాయి. సాక్షిలో మంత్రి దేవినేని ఇలాకాలో అస్మదీయుల మైనింగ్ బీభత్సం… హద్దులు చెరిపి.. అటవీ ధ్వంసం అనీ, నవయుగలో సోదాలు వార్త, దిగువన బీజేపీదే యూటర్న్ అని ప్రచారం చేయండి అని సీఎం చంద్రబాబు వార్త, పక్కన జనం సొమ్ముతో పార్టీ ప్రచారం అనే వార్తలు ప్రధానంగా ఉన్నాయి. ఆంధ్రజ్యోతిలో పతాకంగా ఎర్రని రాజా ఓ చందమామాఅనీ, గ్రహణం రోజు నరబలి యత్నం వార్తలూ… దానికి దిగువన ఆరోగ్యరక్ష-అందరికీ ప్రతినెలా వైద్య పరీక్షలు. అనే వార్త.. దానితో పాటు సీఎంను ఎదుర్కోలేక జగన్  పరార్ అనే పవన్ వాఖ్యలు,  రాజ్యాంగం అంగీకరించకుంటే చట్టంలో ఎందుకు పెట్టారు అని పార్లమెంటులో ఏపీ హోదా వార్తా ఇచ్చారు. ఇక నమస్తే తెలంగాణలో  సత్వరమే బీసీల గణణ అనే పతాక వార్త, దాని పక్కన ఆకాశంలో అద్భుతం అని గ్రహణం విశేషాలిచ్చారు. అవి కాక తెలంగాణకు 30 టిఎంసీలు… ఐటి హబ్ గా హైదరాబాదు వంటి వార్తలను చూడవచ్చు.

ఇదీ తెలుగు పత్రికల వైనం. వెంకయ్య చెప్పినట్టు.. ఏ ఒక్కరూ  వార్తలను వాస్తవ వివరాల ఆధారంగా ఇవ్వడానికి కాకుండా, తమ వెనుకున్న వర్గాలకు మైలేజీ పెంచే విధంగా శీర్షికలు పెట్టి, తత్ సంబంధంగా వార్తలను హైలెట్ చేసుకుంటున్నాయి. ఇటువంటి ఇజాల నేపథ్యంలో వార్తల ప్రాముఖ్యత మారుతుంది. ఒక సంఘటనకు సంబంధించి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి.. ప్రజోపయోగంగా ఆ సమాచారాన్ని వార్తగా ఇవ్వడం ద్వారా పత్రిక ప్రజలకు. జాతికి ఉపయోగకరంగా మనగలుగుతుంది. కానీ ఇలా తమ ఇష్టాలకనుగుణంగా స్వంత వ్యూస్ ను జోడించి వార్త ఇవ్వడం వలన వార్తలో నమ్మిక కలిగించే క్రెడిబిలిటీనెస్ అడుగంటుతుంది. ఎందుకంటే నేడు ముద్రణారంగానికంటే టీవీ మీడియా చాలా వేగంగా వార్తలను అందిస్తోంది. టీవీ వార్తల సౌలభ్యం ఏమిటంటే వారు నేరుగా వీడియో ఇవ్వగలరు. ఉదాహరణకు పవన్ ఒకచోట మాట్లాడితే దాని లైవ్ ప్రసారం జరుగుతోందనుకుందాం.. మరుసటి రోజు పత్రికలో అందుకు పూర్తిగా విరుద్దమైన వార్త కనిపిస్తే… ఎంత పత్రికాభిమాని అయినా కొంత ఆలోచనచేయక మానడు. నిన్న మనం స్వయంగా విన్నదానికీ, ఇపుడు పేపర్లో వచ్చిందానికీ ఇంత వ్యత్యాసమా అంటూ మసి పూసి మారేడు కాయను చేయడానికి ప్రయత్నించిన పత్రిక నైజాన్ని సులభంగా గుర్తిస్తాడు కదా… మరి పత్రికలు ఎందుకని వాస్తవాలను కాదని వ్యూస్ ని ప్రచురిస్తున్నాయో పరిశోథించవలసి ఉంది. టీవీ నే కాదు… దాదాపు ప్రతి రాజకీయ పార్టీకి, ప్రముఖ నేతలకూ ఫేస్ బుక్ , ట్విట్టర్ వంటి ఖాతాలున్నాయి. వీటి ద్వారా కూడా సామాజిక మాధ్యమాలలో ప్రచారం సమాంతరంగా జరుగుతోంది కదా… మరి అన్ని గంటల ఆలస్యంగా పత్రికలో మరో విధంగా వార్తరాయడం ఏవిధంగా సమర్థనీయం.

మామాట : రాజకీయ వార్తలయినా కూడా రాజకీయాలకు అతీతంగా వెలువడే కాలం వస్తుందా..

Leave a Reply