పత్రికలు – పారదర్శకత

Share Icons:

 

తిరుపతి, జూలై 23,   సోమవారం దినపత్రికల్లో సంచలన వార్తలు ఏవీ లేవు. బయట సంచలనాలు జరక్కుండా పత్రికలు మాత్రం ఎలా సంచలన వార్తలిస్తాయంటారా.. నిజమే.. ఈ ఉదయం నాలుగు ప్రధాన తెలుగు దినపత్రికలు వాటి వాటి తీరుతెన్నులకు అనుగుణంగా అవసరమైన వార్తలు వేసుకున్నాయి. ఈనాడు పత్రికలో  ప్రత్రేక హోదాపై ప్రజల్లోకి అంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని ప్రచురించారు. దీనికి దిగువన ఇది వంద శాతం అమలు చేయాల్సిన అంశం అనే ట్యాగ్ ఇచ్చారు.  తరువాత నేనే తుపాకులకు ఎదురెళ్తా అని పవన్ వ్యాఖ్యలను ప్రచురించారు. పవన్ ఎందుకు ఇలా ఆవేశంతో మాట్లాడుతాడో ఎవరికీ అర్ధం కావడం లేదు. అవిశ్వాసం పెట్టండి నేను మద్దతు కూడగడతా నన్నారు, ఢిల్లీ వెళతానన్నారు. ఏదీ ఏమీ చేయలేదు. సాక్షి పత్రిక  హోదా బందుకు సర్వత్రా మద్దతు అనీ, టార్గెట్ భోగాపురం అనే రెండు ప్రధాన వార్తలను ఇచ్చింది. ఆంధ్రజ్యోతి పత్రికలో ఏపీ కి హోదా అంటూ  వచ్చే ఎన్నికల్లో గెలిస్తే  ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ఠయాన్ని ప్రముఖంగా ప్రచురించారు. నమస్తే తెలంగాణ పత్రికలో రాజకీయాలకంటే సమాచారం ప్రధానంగా కనిపించింది. బహుశా అదీ ఓ రాజకీయ ఎత్తుగడ కావచ్చు. కానీ పత్రిక మొదటి పుటలో కొత్తగా 9.200 ఉద్యోగాలు, జోరుగా పంటల సాగు వంటి పాజిటివ్ వార్తలున్నాయి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉందని ఆ పాలక పార్టీ పత్రిక చెప్పకనే చెబుదున్నదేమో. శనివారం పార్లమెంటులో అవిశ్వాసం నాటకం జరిగింది. దాని పర్యవసానాలు పత్రికలు ప్రచురించాయా… హోదా విషయంలో మంచి చెడులను విశ్లేషించాయా… తమ తమ వ్యూస్ రాస్తున్నాయి కానీ వాస్తవాలను రాయడం లేదు.

తొలినుంచి రాష్ట్ర ప్రయోజనాలకోసం కృషి చేస్తున్నవారిని పత్రికలు గుర్తించడం లేదు. గతంలో ఉద్యమం నిర్వహించేవారి నిబద్దత కొలమానంగా వారికి పత్రికలు బ్రహ్మరథం పట్టేవి… అలా చేయడం తమ బాధ్యతగా గుర్తించేవి, కానీ నేడు అలా కాదు.. ప్రతిదీ కులం, మతం, ప్రాంతం రాజకీయ నేపథ్యం వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రచురించడానికి పత్రికలు పనిచేస్తున్నాయి. పారదర్శకత ప్రభుత్వాలకు , రాజకీయ నాయకులకే కాదు పత్రికలకు కూడా ఉండవద్దా అని అడుగుతున్న సందర్భంలో వాస్తవాలు పత్రికలు చెప్పడం లేదని అంటే అందులో ఆశ్చర్యం ఏముంది.

పదివేల మాటలు చెప్పలేని విషయాన్ని ఒక చిన్న రేఖా చిత్రం చెబుతుంది.ఆర్ కే లక్ష్మణ్ వంటి వారు తమ రేఖల గీతలతో ప్రధానులను సైతం ఎత్తిపొడిచిన సంగతి మనకు తెలుసు. కానీ ఇప్పట్లో అంతటి కార్టూనిస్టె లేరనా… న్నారు. మనకూ మంచి కార్టూన్ లు గీచే వారున్నారు అయినా ఈనాడు మాత్రమే క్రమం తప్పకుండా శ్రీధర్  కార్టూన్ ను మొదటి పేజీలో ఒక స్థిరమైన చోట ప్రచురిస్తూ ఉంది. తక్కిన పత్రికలు కార్టూన్ల ను లోపలెక్కడో వేస్తున్నాయి. కొన్ని అదీ లేదు. ఎందుకో.. కార్టూన్ ఆస్వాదించే సంస్కృతి నేటి తరానికి లేదని సదరు పత్రికల అభిప్రాయమా …ఏమో..

 

మామాట : రాజకీయనేతలకు మాదిరే పత్రికలకు కూడా పారదర్శకత అవసరం లేదా.

Leave a Reply