కమలం చెవిలో పువ్వు

Share Icons:

తిరుపతి, జనవరి 29,

దగ్గుబాటి పురందేశ్వరి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు రామారావు కుమార్తె. రామారావు జీవించి ఉన్నంతకాలం రాజకీయాలలోకి రాలేదు. తరువాత మరిది చంద్రబాబు పై కక్షతో కాంగ్రెస్ లో చేరారు. రామారావు తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీలో ఆమె ఎందుకు చేరవలసి వచ్చిందో ఆమెకే తెలియాలి.  సరే. రాష్ట్ర విభజన అనంతర పరిస్థితుల్లో విధి లేక, తెలుగుదేశంలోకి రాలేక, బిజేపిలోకి వెళ్లారు. అక్కడ గత నాలుగేళ్లుగా  పెద్దగా గుర్తింపులేకుండానే చంద్రబాబును ఆడిపోసుకోవడానికే పరిమితమయ్యారు. ఇక నిన్న ఆవిడ భర్త, ఎన్టీఆర్ వెద్ద అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుమారునితో కలిసి హైదరాబాదు వెళ్లి, జగన్ ఇంట్లో ఆయనతో సమావేశం కావడం, ఆ సందర్భంగా ఏవో పుస్తకాలు ఇవ్వడం వివాదంగా మారింది.

మొన్నటికి మొన్న తెలంగాణలో బాబు కాంగ్రెస్ దోస్తీని ఛీత్కరించిన పురదేశ్వరి భర్త, బిడ్డ నేడు వైసీపీ లో ఎలా చేరుతారు. అదీ ఆమె భాజాపాలో ఉండగా, 2019లో ఏపీలో మాదే అధికారం. బాబుకి ఇక శంకరగిరి మాన్యాలే గతి అంటూ బిజేపీ ఎంపీలు, నేతలు, కేంద్ర మంత్రులు పదే పదే చెబుతున్నారు. అటువంటపుడు స్వంత కుమారున్ని మరో పార్టీలోకి పంపడం ద్వారా పురందరేశ్వరి ప్రజలకు ఏం సందేశమిచ్చారు. భాజాపా ఎటూ గెలవదని ఆమె నిర్ణించుకున్నారా. దగ్గుబాటి కుటుంబం వ్యవహరించిన తీరు వారికి మచ్చ తెచ్చేది. పైగా భారతీయ జనతా పార్టీకి మేలు చేసేది కాదు, ఇంకా. చంద్రబాబుకు పరోక్షంగా మద్దతు ఇస్తోంది. ఇక ఇపుడు వారు బాబు పొత్తులపై నోరు మెదపలేరు. తాము ముగ్గురూ మూడు పార్టీలతో అవకాశవాద సంబంధాలు నెరపుతూ.. మరొకరిని నిందించడం ప్రజలు మెచ్చుకోరు గదా.

వెంకటేశ్వరరావు జగన్ ను కలవడంపై నెటిజన్లు ఇప్పటికే పలు వ్యాఖ్యలు చేస్తున్నారు.  నిజానికి పురందేశ్వరి కాంగ్రెస్ లో చేరినపుడు కూడా వివాదం రాజు కుంది. కానీ పార్టీలో, పదవిలో ఆమె పనితీరు కారణంగా ఆప్పట్లో విరోధుల మనసు కూడా పురంధేశ్వరి గెలుచుకున్నారు. అందరికీ ఆమెదయోగ్యురాలుగా ఎదుగుతున్నదశలో రాష్ట్ర విభజన, కాంగ్రెస్ ను వీడవలసిన పరిస్థితి వచ్చింది.  ఆ సమయంలో కనీసం  చిరంజీవిలా మౌనంగా ఉండక.. తొందర పడి భాజాపాలో చేరారు. అప్పట్లో భాజాపా-టీడీపీ బంధం బలంగా ఉండడంతో బాబును సమర్థించలేక,  మౌనంగా ఉండలేక, పుల్లవిరుపు మాటలు ఒకటీ అరా అంటూ ఉన్న మంచి పేరు కాస్తా పోగొట్టుకున్నారు.

ఇక ఇపుడు  తామే రాజ్యానికి వస్తామని ప్రకటించుకుంటున్న పార్టీ, మొత్తం 175 స్థానాలలో పొత్తు లేకుండా పోటీ చేస్తామని భాజాపా చెబుతుంటే, పరుచూరులో తమకు తిరుగులేదనుకుంటున్న దగ్గుబాటి కుటుంబం కుమారున్ని భాజాపా నుంచే పోటీ చేయించి, ఎంఎల్ ఏ ని చేయవచ్చు. అపుడు భాజాపా అధికారంలోకి వచ్చిందా ఏ బాధా లేదు. రాకపోయినా, ప్రతిపక్ష పార్టీ శాసన సభ్యుడుగా పనితీరు నిరూపించుకోవడానికి కుమారునికి మంచి అవకాశం వచ్చి ఉండేది. మరో రకంగా జగనే అధికారంలోకి వస్తే… ఎలాగూ గెలిచిన తరువాత పార్టీ మారే అవకాశం ఉండనే ఉంది, నియోజకవర్గం అభివృద్ధి సాకు చూపించి.

ఆ మార్గం వదిలేసి ఎందుకు ఎన్నికల ముందు భాజాపాకి నైతికంగా పెద్ద దెబ్బ తగిలే విధంగా పురంధేశ్వరి వ్యవహరించారు. జీవీఎల్ వంటి వారు ఇపుడు ప్రజలకు ఏం బదులు చెబుతారు. అట్లా, అన్నిటి కంటే కుమారుడు భవిత ముఖ్యం అనుకున్నపుడు పురందేశ్వరి భాజాపా కి రాజీనామా చేసి ఉండవలసింది.

తాజా వార్త..

పురందేశ్వరి విశాఖనుంచీ వైసీపీ తరపున పోటీ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే…హాయిగా ఆమే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి, కుటుంబంతో కలిసి వైసీపీలోకి వెళ్లి ఉండవలసింది.

మామాట: నీతులు చెప్పడానికే.. ఆచరించడానికి కాదా…

Leave a Reply