మూడు ప్రసంగాలు- నాలుగు వార్తలు

Share Icons:

 

తిరుపతి, ఆగష్టు16,

 

క్రీ. శ. 1557లో పోర్చుగీస్ గవర్నర్ ఆల్‌ఫెన్సో కాలంలో గోవాలో పత్రికా ముద్రణను ప్రవేశపెట్టారు. మొదట్లో పాలకుల అభిప్రాయ వేదికలుగా గుర్తింపు పొందిన పత్రికలు ఆ తర్వాత సంఘ సంస్కరణ, సమాజహితం, నవభావన వేదికలుగా, అభ్యుదయ భావ వీచికలుగా, మితవాద, అతివాద, విప్లవవాద, గాంధీ సత్యాగ్రహం ఆలోచనా దీప్తులుగా పనిచేశాయి. సామాన్య ప్రజల్లో ఆలోచనా పరిజ్ఞానాన్ని మేల్కొలిపాయి.

ఇది మనదేశంలో పత్రికల పుట్టుక, ప్రస్థానం.  ఇక్కడొక సత్యం మనం గుర్తించాల్సి ఉంది. అదే మంటే… భూమి గుండ్రంగా ఉంది. డబ్బు నాణేలు గుండ్రంగా ఉంటాయి. జీవితం కూడా గుండ్రంగా ఉంటుంది.  ప్రతిదీ సున్నారూపంలో చక్రంలా తిరుగుతూ ఉంటుందనేది కాదనలేని జీవన సత్యం.  ఇదంతా ఎందుకంటే.. 1557 లో ప్రభుత్వ బాకాగా జనించిన పత్రికలు మళ్లీ ఇపుడు ఈ 2018 నాటికి తిరిగి ప్రభుత్వాలు, పాలకుల జేబు సంస్థలుగా మారాయని గుర్తుచేయడానికి. కనుక పత్రికలు ఒక వృత్తం పూర్తి చేయడానికి 450 ఏళ్లుకూడా పట్టలేదు.

గురువారం (16.08.18) ప్రముఖ తెలుగుదినపత్రికలు చూద్దాం.. ఈనాడు లో ప్రధాని పంద్రాగ్టు  ప్రసంగం పేదలంగరికీ ఉచిత వైద్యం పేరుతో ఇచ్చారు. మధ్యలో వాజ్ పేయి అనారోగ్య వార్త ఉంది.  ఇక సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని మహా సంగమ సంకల్పం అని వార్త ఇచ్చారు.  సాక్షి కూడా ప్రధాని ప్రసంగాన్ని సెప్టెంబర్  23 న ఆయుస్మాన్ భారత్ అని,  చంద్రబాబు ప్రసంగాన్ని అమరావతిలో సౌకర్యాలు లేవు అనే వార్తగా ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో రేప్ దయ్యాన్ని తరిమేద్దాం అంటూ ప్రధాని ప్రసంగ పాఠం ప్రచురించారు. ఏపీ సీఎం ప్రసంగాన్ని జననం నుంచి మరణం దాకా అండగా అంటూ పెద్ద వార్త రాశారు. . నమస్తే తెలంగాణలో వచ్చేనెల నుంచీ ఆయుస్మాన్ భారత్ అని ప్రధాని వార్తను,  బంగారు తెలంగాణకు పునరంకితం అని సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ప్రధానంగా ఇచ్చారు. మాజీ ప్రధాని వాజ్ పేయి అనార్యోగ్యాన్ని గురించిన వార్తను అన్ని దినపత్రికలూ ప్రముఖంగా ప్రచురించాయి .

బుధవారం దేశానికి 72 వ స్వాతంత్య్రదినోత్సవం… ఆ సందర్భంగా అటు ప్రధాని, ఇటు సీఎం లు ప్రసంగాలు చేయడం, తమ ప్రభుత్వ ఉద్దేశాలను , భవిష్యత్కార్యాచరణను ప్రకటించడం సాధారణంగా జరిగేదే. అయితే బుధవారం జరిగిన మూడు ప్రసంగాలను మన నాలుగు తెలుగు పత్రికలు నాలుగు రకాలుగా ప్రచురించాయి. ఎంత వైవిద్యం ఉందో గమనించారా.. ఒకే ప్రసంగం ఒక్కొక్కరికీ ఒక్కోలాగా వినిపించింది, కనిపించింది. ఇవన్నీ చూసినపుడు ప్రధాని ప్రసంగం ఇంకా ఉందేమో… వీరికి నచ్చనివి ఇంకా వదిలిపెట్టేసి ఉంటారేమో అనిపించక మానదు. ఇదేనా పత్రికా స్వేచ్ఛ.

మనకు పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందనే సామెత ఉంది. అలా పత్రికల యాజమాన్యం వేసుకున్న రంగుకు అనుగుణంగా వార్తలు రూపుసంతరించుకోవడమేమిటో…? ఇది ప్రజోపయోగం ఎలా అవుతుందో…? దీనికోసం పత్రికలకు సంపూర్ణ స్వేచ్ఛకావాలనండం దేనికో.. ! మీడియా నాలుగో స్థంబంగా ఉండడం అంటే ఇదేనా…!?

సాక్షి పత్రికలో ముఖ్యాంశం అమరావతిలో వసతి లేదు కనుక ఏటా వివిధ జిల్లాల్లో ఇలా స్వాతంత్య్రవేడుకలు జరుపుకుంటున్నాం అని సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా ఉంది. ఇంతకంటే సిగ్గుచేటు విషయం మరొకటి ఉంటుందా? దాదాపు 40 సంవత్సరాలు రాజకీయనేతగా, శాసనసభ్యుడుగా, మంత్రిగా, ప్రతిపక్షనేతగా, ముఖ్యమంత్రిగా సుదీర్ఘంగా పనిచేస్తున్నానని చెప్పుకునే చంద్రబాబు పాలనలో నాలుగు సంవత్సరాల తరువాత కూడా జెండా ఎగురవేసు కోవడానికి స్థలం లేకపోవండం ఏమిటి?  జండా పట్టుకును ఏటా ఊరూరూ తిరగడమేమిటి? ప్రభుత్వం ఏం చేసింది ఇంతకాలం… విజయవాడలోనో అమరావతిలోనో ఒక మైదానం సిద్దం చేసుకోలేరా! నాలుగు సంవత్సరాలలో…. హవ్వ… ఇక ప్రాజక్టులేం కడుతారండీ వీరు.. జండా పండుగ ప్రతి ఏడూ వస్తుంది, ఆరోజు జండావందనం, పోలీసు కవాతు ఉంటుందనేది ప్రభుత్వాధి నేతకు తెలియదా…. పదవి చేపట్టిన మొదటి ఏడాది అనుభంతో అనుకుని ఉన్నా ఇప్పటికి ఎంతో విశాలమైన మైదానం సిద్దమై ఉండేది కదా. ఏటా ఇలా ఒక్కో జిల్లాలో  ముఖ్యమంత్రి పాల్గొనే పంద్రాగస్టు వేడుకలకు పెట్టిన ఖర్చు ఎన్ని కోట్లు?   ఆ మొత్తం లో సంగం పెట్టి ఉన్నా శాస్వత మైదానం సిద్దించేది కదా… నేను నిప్పు అని గొప్పలు చెప్పుకునే బాబు, పరిపాలనా ధురంధర, పాలనాదక్ష్యతాసింధు అని జబ్బలు చరుచుకునే తండ్రి, కూమారుల పాలనా తీరిదా… ఇటువంటి విధానాలకేనా అవార్టుల పంట పండుతోంది…  మన బాబుల పాలనలో ఇలా ప్రజాధనం తిరిగిరాని తాత్కాలిక పనులకు తమ బాబు సొమ్ములాగా ఎంత ఖర్చుచేస్తున్నారో శ్వేతపత్రం ప్రకటిస్తే బాగుంటుంది.

 

మామాట: జెండా పండగకు ఖాళీ స్థలం సిద్దం చేసుకోలేని వారు రాజధాని ఎలా నిర్మిస్తారబ్బా… 

Leave a Reply