అవినీతి ఆరోపణలు- పత్రికల వార్తలు

Share Icons:

 

 

తిరుపతి, జూలై 27,    శుక్రవారం ప్రముఖ తెలుగు దినపత్రికలు నాలుగు.. వార్తలు ఎలా ఎంపిక చేసుకున్నాయి, ఎలాంటి శీర్షికలతో తమ పాఠకులకు ఎలాంటి సందేశం ఇచ్చాయి… అన్న విషయాలను పరిశీలిద్దాం.

ఈనాడు పత్రిక మొదటి పుటలో పైన అప్పన్న గిరి ప్రదక్షిణకు 10 లక్షల మంది భక్తులు అనీ, తితిదే లో సమ్మె గంట అంటూ రెండు వార్తలు ఇచ్చింది. దానికి దిగువన అవినీతి కుడుతిలో మోదీ అని సీఎం అన్నట్టు మరో ప్రధాన వార్త రాశారు. అటు పక్కనే… దేశం భాషల మృత్యుదిబ్బ గా మిగులుతుంది. అంటూ భాషల విషమ పరిస్థితిపై వార్తనిచ్చారు.

సాక్షి పత్రికలో పతాకశీర్షికగా ప్రభుత్వ ప్రతిష్ట దిగజారింది ఆదుకోండి అంటూ కలెక్టర్లు, అధికారులతో సీఎం రాజకీయ సమాలోచనలు అనే వార్త వేశారు. మరో పక్క 27వ తేదీ ఏర్పడనున్న చంద్రగ్రహణం గురించిన  అందాల జాబిలి వార్త ఉంది. ఆంధ్రజ్యోతిలో పతాక వార్తగా 150 దాటుతామా  ? అన్న వార్తరాగా, మధ్యలో నాది రైట్ టర్న్ అని చంద్రబాబు ప్రకటనపై వార్త ఇచ్చారు. అలాగే సంపూర్ణ చంద్రగ్రహణంపై నేడు సంపూర్వాణ చంద్రగ్రహణం అనే వార్త  వేశారు.

నమస్తే తెలంగాణలో పతాక వార్తగా అరుణారుణ జాబిలి అనే వార్త రాశారు. ఈ అరుణారుణ ఏమిటో  బోధపడటం లేదు. అరుణ రుణంలో ఉందా….  ఏమిటి? లేక ఎర్రెర్రనిదీ జెండా అనే విప్లవ పాట ప్రభావమా తెలియదు.  దాని దిగువన ప్రముఖంగా ప్రాణం ఖరీదు హెల్మెట్ అంటూ ఓ వార్తా కథనం ప్రచురించారు. ఇక అంతా మామూలే తెలంగాణ ప్రభుత్వ మైలేజీ పెంచే వార్తలే ఉన్నాయి.

సాక్షి పత్రిక తెలుగుదేశం పరువు పోతోంది, చంద్రబాబు పాపం అధికార్ల కాళ్లు పట్టుకుని, పరువు నిలపమని వేడుకుంటున్నాడు అనే విధంగా వార్త రాస్తే… జ్యోతి పత్రికలో పార్లమెంటులో ఎంపీలు బాజాపా దిగజారుతున్న వైనాలను వేన వైనాలుగా చెప్పుకుంటున్నారనీ, వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి కేంద్రంలో 150 సీట్లుకూడా రావనే అనుమానాలను బలంగా వ్యక్తపరుస్తున్నట్టు రాశారు. తెలుగుదేశంతో వైరం తరువాత భాజాపా పతనమౌతున్నట్లు కలరింగ్ ఇచ్చారు. ఇదొక ఎత్తు. కాగా… రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అటు జగన్ ఇటు పవన్ లు రోజూ చేస్తున్న దాడిని తిప్పికొట్టడానికా అన్నట్టు ఈనాడు పత్రిక కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవినీతిమయమైందనే అంశాన్ని వార్తగా ప్రచురించింది. గత నాలుగు సంవత్సరాలుగా రెండు చోట్లా  తెలుగు దేశం-బీజేపీ లు భాగస్వామ్యపార్టీలు కనుక కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అవినీతిపై ఆ రెండు పార్టీలు చేసే ఆరోపణలు సాక్షాలతో నిరూపించబడేవరకూ ప్రజలు సీరియస్గా తీసుకోరు. అవన్నీ ఉత్తుత్తి రాజకీయ ఆరోపణలుగానే భానిస్తారు.

ఇక కేంద్రంలోని నరేంద్రమోదీ పై అవినీతి ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించడం అంత సులభం కాదు. అందుకు చాలా బలమైన సాక్షాలను ప్రతిపక్షాలు.. అవి  కాంగ్రెస్ కావచ్చు, ఇతరులు కావచ్చు సంపాదించవలసి ఉంటుంది. రాపెల్ సహా ఇతర ఆరోపణలపై అందుకే ప్రజల్లో పెద్దగా స్పందన రావడం లేదు. ఎందుకంటే ఇక్కడ అవినీతి రోపణలు చేస్తున్నది గతంలో పరిపాలించి, అవినీతి కుంభకోణాల కారణంగా ప్రజాగ్రహానికి గురైన వారు. ఇదే మోదీ ప్రభుత్వానికి అదనపు బలం.

తెలుగు పత్రికలు అన్నీ కూడా రామన్ మెగసెసే పురస్కార విజేతల గురించి వార్తలు ప్రచురించారు. అలాగే యూట్యూబ్ లో చూసి స్వయంగా పురుడుపోసుకోవాలని ప్రయత్నించిన యువతి మరణించివ వార్తను కూడా పత్రికలన్నీ ప్రముఖంగానే ప్రచురించాయి, ఎందుకో? ఈ  వార్త ద్వారా వారు అందించదలుచుకున్న సందేశమేమిటో… ఇటీవలే కుక్కను కరిచిన వ్యక్తి అంటూ..వాట్సప్ లో వచ్చిన లేదా సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారిన అంశాలను పత్రికలు  ప్రముఖంగా ప్రచురిస్తున్న వైనం గమనించదగింది.

 

మామట: ఇంతకీ ఇవ్వాళ ఈ పత్రికలు ప్రజలకు చెప్పదలుచుకున్నదేమిటి?

Leave a Reply