పత్రికల మేధోమథనం

Share Icons:

తిరుపతి, జూలై 20,  టీడీపీ అవిసశ్వాసం తీర్మాణం వెనుక కేంద్ర సర్కారు కనుసైగ! (సాక్షి), ఈ సభాసమరం ప్రత్యేకం (ఈనాడు), అమీ తుమీ అవిశ్వాసంపై చర్చనేడే (ఆంధ్రజ్యోతి), మోదీకి పరీక్ష నేడే (నమస్తే తెలంగాణ) ఇది తెలుగు లో వెలువడుతున్న నాలుగు ప్రధాన దినపత్రికల తీరు. శుక్రవారం రాష్ట్ర విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అవిశ్వాస తీర్మాణం ఎదుర్కోబోతున్న వేళ తెలుగు పత్రికలు ప్రచురించిన వార్తలు. సంఘటితంగా వ్యవహరించవలసిన వేళ కూడా ఆనాడు విభజన సమయంలో ఎలాగ ఇతరుల లాగూ చొక్కా లాగడానికే పరిమితమైనారో.. అదే రీతిలో సువిశాల జన హితాన్ని మరచి తమ స్వంత ప్రయోజనాల కోసం పత్రికలు వార్తలు ప్రచురించడం చూడవలసి వస్తోంది. గత సమావేశాలలో ప్రతిపక్షాలు ఎంత గింజుకున్నా అవిశ్వాస తీర్మాణం చర్చకు రానీయలేదు కేంద్రం. ఇందుకు సహకరించినవారు పోరుగున ఉన్న తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎంపీలు. మరి తాజా సమావేశాల్లో కేంద్రం ఎందుకు అవిశ్వాస తీర్మాణం చర్చకు తీసుకుంది. మారిన పరిస్థితులు ఏమిటి అన్నది పత్రికలు ప్రజలకు చెప్పాలి కదా,  ఈ నాలుగు మాసాల్లో మారిన పరిస్తితులు ఏమిటి. ఎందుకు కేంద్రం సాహసం చేసింది. పార్లమెంటులో అవిశ్వాస తీర్మాణం చర్చకు రావడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనం ఏమిటన్నది ప్రజలకు తెలియాలి. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన తరువాత, వారి రాజీనామాలను సభాపతి ఆమోదించిన తరువాత పార్లమెంటులో అవిశ్వాస తీర్మాణం చర్చకురావడం వెనుక ఏదైనా రాజకీయ కారణం ఉందా తెలియాల్సి ఉంది.

ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలే అయినపుడు ఏంచేయాలో ప్రజలే నిర్ణయించుకుంటారు. ఎలాగూ ఎన్నికలు త్వరలోనే వస్తున్నా యి కదా. పాలకులు ప్రజలు అమాయకులు అని అనుకుంటారు కానీ, ప్రజలు చాలా తెలివైన వారు. ఓటు ఆయుధంతో శిక్షిస్తారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి, విభజన తరువాత తెలంగాణా, ఏపీ లలో కాంగ్రెస్  పార్టీ పరిస్థితి గమనించినపుడు ఈ వాస్తవం తెలుస్తుంది.

పోలవరం పై కూడా పత్రికల్లో రకరకాలైన వార్తలు వెలువడుతున్నాయి. అక్రమాలు జరుగుతున్నా యని ఒక పత్రిక నిత్యం రాస్తుంది. తక్కిన పత్రికలు ఈ అంశాన్ని పట్టించుకోవు. కొన్ని పత్రికలు అంతా బాగుందనే వాతావరణం ప్రచారం చేస్తుంది. జాతి భవిష్యత్తుతో ముడు పడిన ఇంతటి పెద్ద జాతీయ ప్రాజక్ట్ విషయంలో పత్రికలు నాలుగు స్థంభాల ఆట ఆడుతున్నాయి.

గురువారం ఏపీ ప్రభుత్వం ఈ-ప్రగతి సాప్ట్వేర్ విడుదల చేసింది. ఇది ఆధునికమైన ప్రక్రియ.. ఆహ్వానించదగినది, లోపాలుంటే పత్రికలు చర్చించాలి అలా జరగడం లేదు. పత్రికలు  రాజకీయ నేతల్లాగా వ్యవహరిస్తున్నారు. తమకు ఇష్టం లేకపోతే బురద జల్లడమే కార్యక్రమంగా పెట్టుకుంటు న్నారు.  చాలా అంశాలు పత్రికల్లో చోటు సంపాదించలేక పోతున్నాయి. కేవలం రాజకీయంగా బురద జల్లే కార్యక్రమానికి, సినిమా నటీనటుల కుటుంబ, వ్యక్తిగత విషయాలను వాటిపే వచ్చే పుకార్లు రాయడానికీ  పత్రికలు ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాయి.

 

మామాట : ప్రజల భవిత ఈనాటి పత్రికలకెందుకు …..?

Leave a Reply