ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మచిలీపట్నం బెల్‌లో ఉద్యోగాలు…

multiple vacancies in bel, HPCL, agriculture scientists
Share Icons:

హైదరాబాద్: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్-ఓ‌ఎఫ్‌బి భారీగా ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలోనే షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గతంలో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ ఖాళీలను ప్రకటిస్తూ డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో మొత్తం 6060 ఖాళీలను ప్రకటించింది. అందులో 3808 ఐటీఐ పోస్టులు, 2252 నాన్ ఐటీఐ పోస్టులు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో గల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 పోస్టులున్నాయి.

మొత్తం 6060 పోస్టుల్లో రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణ- 438, చండీగఢ్- 46, మధ్యప్రదేశ్- 534, మహారాష్ట్ర- 1860, ఒడిషా- 63, తమిళనాడు- 1080, ఉత్తర ప్రదేశ్- 1163, ఉత్తరాఖండ్- 228, పశ్చిమ బెంగాల్- 583 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 10న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 9 చివరి తేదీ. విద్యార్హత వివరాలు చూస్తే నాన్ ఐటీఐ అభ్యర్థులు 10వ తరగతి 55 శాతం మార్కులతో పాస్ కావాలి. మ్యాథ్స్, సైన్స్‌లో 40% మార్కులు ఉండాలి. ఐటీఐ పోస్టులకు ఐటీఐ పాస్ కావాలి. వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

పూర్తి వివరాలకు

https://www.ofb.gov.in/

బెల్‌

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌(బెల్‌), మ‌చిలీప‌ట్నం(ఏపీ)యూనిట్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ట్రెయినీ ఇంజినీర్‌

మొత్తం ఖాళీలు: 21

విభాగాలు: ఎల‌క్ట్రానిక్స్‌, మెకానిక‌ల్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, సివిల్‌.

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్.

చివ‌రితేది: 27.01.2020.

చిరునామా: Manager (HR), BEL, Post Box No.26, Ravindranath Tagore Road, Machilipatnam- 521 001, AP.

http://www.bel-india.in/

 

Leave a Reply