ఐబీపీఎస్‌, ఎన్‌టి‌పి‌సి లలో ఖాళీలు.

multiple jobs in TSSPDCL, HMT, Indian army, coal india
Share Icons:

హైదరాబాద్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్(ఐబీపీఎస్‌) కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌(సీఆర్‌పీ)-9 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వార కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 1163

పోస్టులు-ఖాళీలు: ఐటీ ఆఫీస‌ర్‌-76, అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఫీల్డ్ ఆఫీస‌ర్‌-670, రాజ్‌భాష అధికారి-27, లా ఆఫీస‌ర్‌-60, ప‌ర్స‌న‌ల్ ఆఫీస‌ర్‌-20, మార్కెటింగ్ ఆఫీస‌ర్-310.

అర్హ‌త‌: పోస్టుని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌, ఇంజినీరింగ్ డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 20-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ప‌్రిలిమిన‌రీ, మెయిన్స్ ఎగ్జామ్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ముఖ్య‌మైన తేదీలు:

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 06.11.2019

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 26.11.2019.

* ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌తేది: డిసెంబ‌రు 28, 29.

* మెయిన్స్ పరీక్ష‌తేది: 25.01.2020.

వెబ్ సైట్: https://www.ibps.in/

ఎన్‌టీపీసీ

భార‌త ప్ర‌భుత్వానికి చెందిన జార్ఖండ్‌, ఒడిషా, చ‌త్తీస్‌గ‌ఢ్‌లోని ఎన్‌టీపీసీ యూనిట్లు కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నాయి.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 192

పోస్టులు: మైన్ ఓవ‌ర్‌మెన్‌, అసిస్టెంట్ మైన్ స‌ర్వేయ‌ర్, మైనింగ్ సిర్దార్‌, మైనింగ్ ఎల‌క్ట్రిక‌ల్ సూప‌ర్‌వైజ‌ర్‌.

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణ‌త‌, టెక్నిక‌ల్‌ స‌ర్టిఫికెట్లు,అనుభ‌వం.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ఆధారంగా.

ప‌రీక్ష‌తేది: డిసెంబ‌రు 22.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.

చివ‌రితేది: 30.11.2019.

వెబ్ సైట్: http://ntpccoalmines.in/

బీఈసీఐఎల్

బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్) న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* మొత్తం ఖాళీలు: 20

పోస్ఠులు-ఖాళీలు: మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, ల్యాబ్ అటెండెంట్.

అర్హత: ఇంటర్మీడియట్(సైన్స్), బీఎస్సీ(ఎంఎల్టీ) ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్.

చివరితేది: 20.11.2019.

చిరునామా: BECIL’s Corporate Office at BECIL Bhawan, C-56/A-17, Sector-62, Noida-201307 (U.P).

వెబ్ సైట్: https://www.becil.com/

ఎన్ఐఆర్‌డీపీఆర్‌

హైద‌రాబాద్ ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న‌ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీ రాజ్(ఎన్ఐఆర్‌డీపీఆర్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను కోరుతోంది.

వివ‌రాలు…

* మొత్తం ఖాళీలు: 19

పోస్టులు: డైరెక్ట‌ర్-ఎన్ఆర్ఎల్ఎం ఆర్‌సీ, మిష‌న్ మేనేజ‌ర్‌, అకౌంట్స్ క‌మ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌, బీటెక్, పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విదానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివ‌రితేది: 17.11.2019.

వెబ్ సైట్: http://nirdpr.org.in/

 

Leave a Reply