అమరావతికి అంబానీ…

Share Icons:

అమరావతి, 13 ఫిబ్రవరి:

ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నేడు అమరావతికి రానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి, ముఖేష్ అంబానీ భేటీ కానున్నారు.

మరికాసేపట్లో విజయవాడకు రానున్న ఆయన, వెలగపూడికి చేరుకుని సచివాలయంలో ఏర్పాటు చేసిన ఆర్టీజీ సెంటర్‌ను పరిశీలించనున్నారు.

అనంతరం ముఖేష్, చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు, వివిధ అంశాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలోని కేజీ బేసిన్‌లో చమురు నిల్వలను వెలికితీస్తున్న ముఖేష్ అంబానీ, మరిన్ని పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకు వచ్చేలా తనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, అనుమతులపై ముఖ్యమంత్రితో చర్చలు జరపనున్నారు.

అన్నీ అనుకున్నట్టు కుదిరితే పెట్రో కారిడార్‌లో ముఖేష్ భారీ పెట్టుబడులు పెడతారని తెలుస్తోంది. అలాగే ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

మామాట: పెట్టుబడులేనా…ఇంకేమన్నా లావాదేవీలు ఉన్నాయా…?

English summary:

Today Reliance Industries chairman Mukesh Ambani will meet Chief Minister Chandrababu Naidu in Amravati.

Leave a Reply