మోడీకి ముద్రగడ లేఖ: చంద్రబాబు పంపిన బిల్లుని ఆమోదించండి

mudragada padmanbham write a letter to pm modi
Share Icons:

కాకినాడ:

 

కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ప్రధాని మోదీని కోరారు. దేశ స్వాతంత్ర్యానికి ముందు..ఆ తర్వాత కాపులు ఏపీలో బీసీ రిజర్వేషన్లు అనుభవించారని గుర్తు చేశారు.

 

1915 నుంచి 1956 వరకు కాపులకు ఈ రిజర్వేషన్లు అమలులో ఉన్నట్లు చెప్పారు. 1956లో ఏపీ సీఎం నీలం సంజీవరెడ్డి కాపులకు రిజర్వేషన్లు రద్దు చేసినట్లు గుర్తుచేశారు. 1961లో దళిత సీఎం దామోదరం సంజీవయ్య తిరిగి కాపులకు రిజర్వేషన్లు తీసుకొచ్చారని వివరించారు. అయితే 1964లో నాటి సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి కాపులకు రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేసి…కాపు సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు.

 

గత 50 ఏళ్లుగా రాజకీయ పార్టీలకు కాపులకు తిరిగి రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని…ఆ తర్వాత తమ హామీలను నెరవేర్చకుండా కాపులను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. బీసీ(ఎఫ్) కేటగిరీలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2017లో నాటి చంద్రబాబు ప్రభుత్వం ఏపీ అసెంబ్లీలో బిల్లును ఆమోదించిందన్నారు. దీన్ని కేంద్ర హోం శాఖకు పంపగా…ఇప్పటి వరకు అది పెండింగ్‌లో ఉందన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపి కటిక పేదరికంలో మగ్గుతున్న కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ లేఖలో కోరారు.

 

Leave a Reply