దక్షిణాఫ్రికా సిరీస్ కి చహల్,కుల్దీప్ లని ఎందుకు పక్కనపెట్టారో?

msk-prasad-explains-why-kuldeep-yadav-yuzvendra-chahal-not selected south africa series
Share Icons:

ఢిల్లీ:

మరో నాలుగు రోజుల్లో టీమిండియా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లు ఆడనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్15 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. అయితే ఈ టీ20లకి రెగ్యులర్ స్పిన్నర్లు చహల్, కుల్దీప్ యాదవ్ లని ఎంపిక చేయలేదు. దానికి సెలక్షన్ కమిటీ సరైన కారణాలనే చెబుతోంది. టీ20 ప్రపంచకప్‌కు ఏడాది మాత్రమే సమయం ఉన్నందున టీమిండియా ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇటీవలే ముగిసిన విండీస్‌ టూర్‌కు యువకులకు అవకాశం ఇచ్చారు. అందుకనే బౌలింగ్ విభాగంలో కుర్రాళ్లకు చోటిచ్చారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తమదైన ముద్ర వేసిన కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చహల్‌లకు టీ20 జట్టులో చోటివ్వలేదు. ఇక త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు కూడా ఎంపిక చేయలేదు. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

తాజాగా దీనిపై చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ మాట్లాడూతూ… ‘స్పిన్‌ బౌలింగ్‌ విభాగంలో వైవిధ్యమైన బౌలర్లను ఎంపిక చేయాలనుకున్నాం. ఆస్ట్రేలియాలో జరుగున్న టీ20 ప్రపంచకప్‌ వరకు యువ క్రికెటర్లను పరీక్షించాలనుకుంటున్నాం. కుల్దీప్‌, చహల్‌లు పొట్టి ఫార్మాట్‌లో మంచి బౌలర్లు. ఇందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పారు. కానీ యువ క్రికెటర్లను కూడా జట్టులోకి తేవాలనుకుంటున్నమని, ఇటీవల కాలంలో యువ క్రికెటర్లు కూడా సత్తా చాటుతున్నారని,  ఫాస్ట్‌ బౌలర్‌లు నవదీప్‌ షైనీ, దీపక్ చాహర్ బాగా రాణించారని అన్నారు. అలాగే శ్రేయస్‌ అయ్యర్‌ కూడా సత్తాను నిరూపించుకున్నాడని, కృనాల్‌ పాండ్యా, రాహుల్ చాహర్, వాషింగ్టన్‌ సుందర్‌లు పొట్టి ఫార్మాట్‌లో మంచి ప్రదర్శన చేశారని, వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే కుల్దీప్‌, చహల్‌లను పక్కకు పెట్టాం’ అని ఎంఎస్‌కే తెలిపాడు.

ఇక ఈ టీ20లు తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు ఆడనుంది. అందులో భాగంగా ఓపెనర్ కే‌ఎల్ రాహుల్ ని పక్కనబెట్టి రోహిత్ శర్మకు అవకాశం కల్పించారు. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టెస్టుల్లో రోహిత్ శర్మ ఎంపికైనప్పటికీ తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. అయితే, ఈ పర్యటనలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శన చేయడంతో ఇప్పుడు తెరపైకి రోహిత్ శర్మ పేరు మరోసారి వచ్చింది. 2014లో అరంగేట్రం చేసిన కేఎల్‌ రాహుల్‌ మాత్రం ఇప్పటికే 36 టెస్టులు ఆడాడు.

అయితే, రోహిత్ శర్మతో పోలిస్తే కేఎల్ రాహుల్ ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌‌గా కేఎల్ రాహుల్ 36 మ్యాచ్‌ల్లో 34.58 యావరేజితో 2006 పరుగులు చేశాడు. టెస్టుల్లో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌‌గా బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ 27 టెస్టుల్లో 39.62 యావరేజితో 1585 పరుగులు సాధించడం విశేషం.

 

Leave a Reply