ధోనీ గ్లోవ్స్‌పై ఆర్మీ సింబల్ తొలగించాలని ఐసీసీ ఆదేశాలు

Share Icons:

లండన్, 7 జూన్:

2015లో ప్యారా బ్రిగేడ్‌ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ఇచ్చి గౌరవించుకున్న విషయం తెల్సిందే. ఇక పద్మ పురస్కారాన్ని కూడా ధోనీ.. ఆ హోదాలోనే అందుకున్నాడు. ఇక క్రికెట్‌లో కూడా ధోనీ తన కీపింగ్ గ్లోవ్స్‌పై భారత పారా దళాలకు చెందిన చిహ్నాం(బలిదాన్ బ్యాడ్జ్) ని పెట్టుకున్నాడు.

ఇక వరల్డ్ కప్‌లో మొన్న మ్యాచ్ సందర్భంగా యుజవేంద్ర చాహల్ వేసిన 40వ ఓవర్‌లో ధోనీ..సౌతాఫ్రికా ఆటగాడు.. పెహ్లుక్‌వాయోని స్టంప్‌ ఔట్ చేశాడు.ఈ వికెట్ రిప్లైలో ధోనీ గ్లోవ్స్‌పై ఉన్న ఆ చిహ్నం కనిపించింది. అయితే తన గ్లోవ్స్‌పై ఆర్మీ చిహ్నాన్ని ధరించిన ధోనీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. ఐసీసీ  మాత్రం వ్యతిరేకించింది.

ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఆటగాళ్ల దుస్తులు, వస్తువులు ఎటువంటి రాజకీయ, మతపరమైన, జాతి పరమైన వాటిని ప్రతిబింబించవద్దు.. ఆ కారణంగా ధోనీని ఆ చిహ్నాన్ని తొలగించమని ఐసీసీ కోరినట్లు సమాచారం.

Leave a Reply