బాబు…కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడు..

chandrababu sensational decision tdp arrange the Rehabilitation for the activists
Share Icons:

హైదరాబాద్: ఎప్పటిలానే ఈరోజు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ఫ్లెక్సీలపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ తీరు సరికాదని చెబుతూ ట్వీట్ చేశారు.

‘వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టుకోవద్దట. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడు. నువ్వు నెలనెలా బిచ్చమేస్తేనే ప్రజలు బతుకుతున్నారనుకుంటున్నావా బాబూ? ఎవడబ్బ సొమ్మని ఫ్లెక్సీలు కడతారని చించుకుంటున్నావు. 14 ఏళ్లు సీఎంగా చేసినోడివి ఇంతగా పతనమవుతావని అనుకోలేదు’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

ఇదిలా ఉంటే చంద్రబాబుకు బాగా ఫ్రస్టేషన్ పెరిగిపోతుందని తెలుస్తోంది. దానికి ఉదాహరణే ఆయన కుప్పం పర్యటనలో జగన్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు. విధాన‌ప‌రంగా మాట్లాడాల్సిన ప‌రిస్థితుల్లో ఉన్నా చంద్ర‌బాబు నాయుడు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్ర‌మంలో త‌న‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల‌నే ఫినిష్ చేసే రోజు వ‌స్తుందంటూ చంద్ర‌బాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఇక చంద్ర‌బాబు నాయుడే అలా మాట్లాడుతూ ఉండ‌టంతో ప‌చ్చ పార్టీ కార్య‌క‌ర్త‌ల నోళ్ల‌కు మ‌రింత హ‌ద్దు లేకుండా పోతోంది.

అలాగే ‘సీఎం జగన్‌ మీద అనేక క్రిమినల్‌ కేసులున్నాయనే ట్రంప్‌ పర్యటన సందర్భంగా పిలుపు రాలేదు. అమెరికా చట్టం చాలా నిక్కచ్చిగా ఉంటుంది. ఇలాంటి ఆర్థిక నేరగాళ్లను వాళ్లు దూరంగా పెడతారు’ అని చంద్రబాబు విమ‌ర్శ‌ల‌కు దిగారు.

టీడీపీ హయాంలో దేశవిదేశాలకు చెందిన అధినేతలు, కార్పొరేట్‌ సంస్థల సీఈవోలు మన రాష్ట్రానికి వచ్చారు. ఇక్కడి పాలనా పద్ధతులనూ, అభివృద్ధినీ ప్రశంసించారు. అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్‌ రాక సందర్భంగా కనీసం మన ముఖ్యమంత్రికి ఆహ్వానం లేకపోవడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఆర్థిక నేరస్థుడు కాబట్టే జగన్‌కు కేంద్రప్రభుత్వం నుంచి పిలుపందలేదు’ అని బాబు ఘాటుగా విమ‌ర్శించారు.

 

Leave a Reply