త్వరలో ఇండియాలో విడుదల కానున్న మోటోరోలా నూతన స్మార్ట్‌ఫోన్..

motorola released p50 smartphone in china
Share Icons:

ముంబై:

 

అమెరికాకు చెందిన టెలీ కమ్యూనికేషన్ సంస్థ మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ పి50 ని తాజాగా చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.24,880 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇది త్వరలో భారత్ మార్కెట్లో కూడా విడుదల కానుంది.

 

మోటోరోలా పి50 ఫీచర్లు…

 

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9609 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

ఇక కార్డియో 2 పేరిట లెనోవో ఓ నూతన స్మార్ట్‌బ్యాండ్‌ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 0.87 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ బ్యాండ్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఆయా డివైస్‌లకు వచ్చే నోటిఫికేషన్లు ఈ బ్యాండ్ తెరపై కనిపిస్తాయి. ఈ బ్యాండ్‌లో హార్ట్ రేట్ మానిటర్, సెడెంటరీ రిమైండర్, స్లీప్ మానిటరింగ్, వాటర్ రెసిస్టెన్స్, 20 రోజుల బ్యాటరీ లైఫ్ తదితర ఇతర ఫీచర్లను అందిస్తున్నారు. ఇక ఈ బ్యాండ్‌ను రూ.1499కు అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నారు.

Leave a Reply