బడ్జెట్ ధరలో మోటోరోలా వన్ యాక్షన్….

motorola released one action in india
Share Icons:

ముంబై:

ప్రముఖ మొబైల్స్ తయారీదారు మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటోరోలా వన్ యాక్షన్‌ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.13,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 30వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం కానుంది.

ఇక లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై పలు ఆఫర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలోనూ కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్ కార్డులతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1వేయి వరకు డిస్కౌంట్‌ను అందిస్తారు. జియో వినియోగదారులకు రూ.2200 వరకు క్యాష్‌బ్యాక్, 125 జీబీ వరకు అదనపు డేటా లభిస్తుంది.

మోటో వన్ యాక్షన్ ఫీచర్లు: 6.3 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9609 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 16, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ..

ఇక జీబ్రానిక్స్ కంపెనీ.. మాస్టర్‌పీస్ పేరిట ఓ నూతన వైర్‌లెస్ స్పీకర్‌ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక ఆఫ్‌లైన్ స్టోర్స్‌తోపాటు పలు ఆన్‌లైన్ స్టోర్స్‌లోనూ ఈ స్పీకర్‌ను రూ.2699కు విక్రయిస్తున్నారు. ఇందులో 57ఎంఎం 8వాట్ల ఆడియో డ్రైవర్స్‌ను ఏర్పాటు చేసినందున సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. ఈ స్పీకర్‌ను ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 12 గంటల వరకు నాన్‌స్టాప్‌గా దీన్ని ఉపయోగించుకోవచ్చు. బ్లూటూత్ 4.2 ద్వారా ఈ స్పీకర్‌ను ఇతర డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.

 

Leave a Reply