ఆకర్షణీయమైన ఫీచర్లతో మోటోరోలా వన్ మాక్రో విడుదల….

Motorola One Macro Launched In India Price Specifications
Share Icons:

ముంబై: ప్రముఖ మొబైల్స్ తయారీదారు మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటోరోలా వన్ మాక్రోను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ ధర రూ.9,999 ఉండగా దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 12వ తేదీ నుంచి విక్రయించనున్నారు.

మోటోరోలా వన్ మాక్రో ఫీచర్లు…

6.2 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 2, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు. 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

హెచ్‌పీ.. పెవిలియన్ ఎక్స్360

ప్రముఖ కంప్యూటర్ ఉత్పత్తుల తయారీదారు హెచ్‌పీ.. పెవిలియన్ ఎక్స్360 పేరిట భారత్‌లో ఓ నూతన ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఇందులో 14.3 ఇంచుల ఫుల్ హెచ్‌డీ టచ్ డిస్‌ప్లే, ఇన్‌బిల్ట్ అలెక్సా సపోర్ట్, 1టీబీ హెచ్‌డీడీ, 256/512 జీబీ ఎస్‌ఎస్‌డీ, ఎన్‌వీడియా జిఫోర్స్ ఎంఎక్స్250 గ్రాఫిక్స్ కార్డ్, ఇంటెల్ కోర్ ఐ3/ఐ5/ఐ7 10వ జనరేషన్ ప్రాసెసర్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.45,990గా ఉంది.

శాంసంగ్ యానివర్సరీ సేల్

ఎలక్ట్రానిక్స్ తయారీదారు దిగ్గజం శాంసంగ్ తన ఆన్‌లైన్ స్టోర్‌లో యానివర్సరీ సేల్‌ను నిర్వహిస్తున్నది. ఈ సేల్ తాజాగా ప్రారంభం కాగా అక్టోబర్ 13వ తేదీ వరకు కొనసాగనుంది.  శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లతోపాటు అనేక ఉత్పత్తులపై తగ్గింపు ధరలను అందిస్తున్నారు. సేల్‌లో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులను ఉపయోగించి ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అమెజాన్ పే ట్రాన్సాక్షన్లతో రూ.1500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక గెలాక్సీ ఎస్9, నోట్9 ఫోన్లపై సేల్‌లో భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

Leave a Reply