ముంబై: మోటరోలా మడతపెట్టే ఫోన్ వచ్చేసింది. స్మార్ట్ ఫోన్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోటో రేజర్ ఇప్పుడు భారత్‌లోకి ఎంట్రీ అయింది. ప్రస్తుతం ఆన్లైన్ స్టోర్ ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉంది. మోటో రేజర్ ప్రారంభ ధర భారత మార్కెట్లో రూ. 1,24,999గా నిర్ణయించారు. ఇప్పటివరకు ఉన్న పాత ఫోల్డబుల్ ఫోన్‌ను కొత్త హంగులతో మార్పులు చేసి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా విడుదల చేసింది. ఏప్రిల్ 2 తేదీ నుంచి పూర్తిస్థాయిలో మోటో రేజర్ ఫోన్లు అన్ని చోట్లా అందుబాటులోకి రానున్నాయి.
ఫీచర్లు :
డిస్ప్లే : 6.2 అంగుళాలు
ప్రాసెసర్ : ఎస్‌డిఎం 710
మెమొరీ: 6 జీబీ
స్టోరేజీ : 128 జీబీ
రియర్ కెమెరా : 16 ఎంపీ
సెల్ఫీ కెమెరా : 5 ఎంపీ
బ్యాటరీ : 2510
కలర్ : బ్లాక్
రేపే బిగ్ షాపింగ్ డేస్ సేల్
ఫ్లిప్‌కార్ట్ మార్చి 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు బిగ్ షాపింగ్ డేస్ పేరిట కొత్త సేల్‌ను ప్రకటించింది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్పీకర్స్, స్మార్ట్ ఉత్పత్తులపై ఆఫర్లు అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు యూజర్లకు ఈ సెల్లో 10శాతం అదనపు డిస్కౌంట్ అందించనుంది. రెడ్మీ నోట్‌ప్రో ఫోన్‌ను ఈ సేల్‌లో రూ.11,999లకు విక్రయించనున్నారు.
వివో జడ్1 ప్రో రూ.11,990, శాసంగ్ గెలాక్సీ ఎస్9 రూ.21,999, శాంసంగ్ గెలాక్సీ ఏ50 రూ.12,999, రియల్మీ 5 ప్రో రూ.11,999కి, విక్రయించనున్నారు. యాపిల్ ఐఫోన్ ఎక్స్ఎస్ 64జీబీ వేరియంట్ రూ.52,999కే లభించనుంది. ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ రూ.24,990, అనూస్ 6జన్ రూ.23,999 గూగుల్ పిక్సల్ 3ఏని రూ.26,999కి విక్రయించనున్నారు. ఈ ఆఫర్లతో పాటు నో కాస్ట్ ఈఎంఐ కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. పాత ఫోన్లకు ఎక్చ్సేంజీపై అదనపు డిస్కౌంట్ అందిస్తున్నారు.