టీఆర్ఎస్‌లో చేరనున్న మోత్కుపల్లి?

Share Icons:
  • పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం 
  • తనను పట్టించుకోక పోవడం

తెలంగాణ బీజేపీ  నేత మోత్కుపల్లి నర్సింహులు పార్టీకి  శుక్రవారం (జులై 23) మీడియా ముందు అధికారికంగా రాజీనామా ప్రకటిస్తారని సమాచారం. బీజేపీని వీడి త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కొత్తగా తీసుకొచ్చిన ‘దళిత సాధికారత పథకం'(దళిత బంధు) బీజేపీలో మోత్కుపల్లికి,ఆ పార్టీ నాయకత్వానికి మధ్య చిచ్చు పెట్టింది. పార్టీ ఆదేశాలను కాదని.. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైనప్పటి నుంచి మోత్కుపల్లిని ఆ పార్టీ దూరం పెడుతున్నట్లు, సీనియర్ నేత అయినప్పటికీ పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వకపోవడం,   కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీని వీడి టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు అభిజ్ఞానవర్గాల బోగట్టా.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్. 

Leave a Reply