రాజకీయ వ్యవస్థలో చంద్రబాబు ఓ చీడపురుగు….

Is Motkupalli ready to join TRS party
Share Icons:

యాదాద్రి, 13 జూన్:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.

రాజకీయ వ్యవస్థలో చంద్రబాబుచీడ పురుగులాంటి వాడని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి పాలు కావాలని తిరుమల కొండెక్కి కోరుకొంటానని చెప్పారు.

ఈరోజు యదాద్రి జిల్లా ఆలేరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు ప్రజలే బుద్ది చెబుతారని, ఆయన నడిపేది దుర్మార్గపు టీడీపీ పార్టీ అని మండిపడ్డారు. ఇక ఆయన ఏపీని అవినీతిలో నెంబర్‌గా నిలిపారని ఆరోపించారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు దొరికిన దొంగలని అన్నారు, నందమూరి కుటుంబానికి టీడీపీని అప్పగించాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ పోరాటం చేస్తున్నారని అన్నారు.

కాగా, ఇటీవల చంద్రబాబుపై విమర్శలు గుప్పించినందుకు గాను నర్సింహులుపై గత నెల 28వ తేదిన టీడీపీ వేటు వేసింది. ఈ వేటు తర్వాత ఆయన తొలిసారిగా ఆలేరు నియోజకవర్గంలో తన అనుచరులతో బుధవారం నాడు సమావేశం కానున్నారు.

మామాట: పార్టీలో ఉన్నన్నీ రోజులు ఇవేం గుర్తుకు రాలేదా..?

Leave a Reply