కన్న కూతురిని లైంగికంగా వేధించిన తల్లి…..

mother sexual harassed her daughter
Share Icons:

చెన్నై, 12 అక్టోబర్:

ఇప్పటివరకు కామంతో కళ్లుమూసుకుపోయిన తండ్రులు.. బిడ్డలను లైంగికంగా వేధించిన వార్తలను మాత్రమే మనం చదివాం. కానీ ఇది అందుకు పూర్తిగా భిన్నం. కంటికి రెప్పల కాపాడుకోవాల్సినే కన్నతల్లే..కూతుర్ని లైంగికంగా వేధించింది. ఇక ఆమె చేస్తున్న పని తప్పు చెప్పాల్సిన బామ్మ.. ఆమెను ప్రోత్సహించడం విశేషం. ఈ అమ్మతనానికి మచ్చతెచ్చే ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని తేనాంపేటలో 14 ఏళ్ల బాలిక తల్లిబామ్మలతో నివసిస్తుంది. అయితే తల్లితో మనస్పర్థలు రావడంతో తండ్రి విడిపోయాడు.

ఈ క్రమంలోనే తల్లి స్వలింగ సంపర్కం పెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ బాలికను వేధించసాగింది. ఇక  ఆ బాధని తట్టుకోలేక ఈ విషయం గురించి ఆ బాలిక తన తండ్రికి చెప్పింది. దీంతో అతను పలుమార్లు భార్యని, అత్తని హెచ్చరించినా వారిలో మార్పు రాకపోవడంతో అతను పోలీస్టేషన్ మెట్లు ఎక్కాడు.

తన భార్య, అత్త కలిసి కుమార్తెను లైంగిక వేధింపులకు గురిచేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.   అలాగే సాక్ష్యంగా సెల్‌ఫోన్‌లో వీడియో ఆధారాన్ని కూడా పోలీసులకు సమర్పించాడు. పోలీసులు బాలిక తల్లిని పోక్సో చట్టం క్రింద, దీనికి ప్రోత్సహించిన ఆమె బామ్మను అరెస్టు చేశారు.

మామాట: ఇలా కూడా ఉంటారా…

Leave a Reply