కేరళను తాకనున్న రుతుపవనాలు

Share Icons:

అమరావతి, మే 15,

వేసవి కాలం, ఉక్కపోతతో అల్లాడిపోతున్నవారికి శుభవార్త. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళను తాకనున్నాయి. ఈసారి సగటు కన్నా కాస్త తక్కువగానే వర్షాలు ఉంటాయని ప్రైవేట్ వాతావరణ సూచనల కేంద్రం స్కైమెట్ తెలిపింది. ప్రతీ ఏటా జూన్ మొదటి వారంలో కేరళలో వర్షాలు మొదలై జూలై రెండోవారం నాటికి దేశమంతా కురుస్తాయి.

ఈసారి సకాలంలోనే నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి.  సగటుతో పోలిస్తే ఈసారి 93 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని స్కైమెట్ తెలిపింది. ఏడాదంతా కురిసే వర్షాల్లో మాన్‌సూన్ సీజన్‌లోనే 70 శాతం వర్షాలు కురుస్తాయి.

స్కైమెట్ అంచనా ప్రకారం వర్షాలు కురిసే అవకాశాలు ఇలా ఉన్నాయి..

అధిక వర్షపాతం- 0 శాతం

సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం- 0 శాతం

సాధారణ వర్షపాతం- 30 శాతం

సాధారణం కన్నా తక్కువ వర్షపాతం- 55 శాతం

కరవు ప్రాంతం- 15 శాతం

సగటు వర్షపాతంలో 96 శాతం నుంచి 104 శాతం మధ్య ఉంటే ‘సాధారణ’ వర్షపాతంగా, 90 శాతం కన్నా తక్కువ ఉంటే ‘లోటు’ వర్షపాతంగా, 90-96 మధ్య ఉంటే ‘సాధారణం కన్నా తక్కువ’ వర్షపాతంగా, 110 శాతం కన్నా ఎక్కువ ఉంటే ‘అధిక’ వర్షపాతంగా గుర్తిస్తారు.

మామాట- అంటే రైతుల ఆశలపై నీళ్లే నా

Leave a Reply