ఆగస్టు 15న విడుదల కానున్న మోహన్ లాల్, సూర్య మూవీ….

Share Icons:

చెన్నై, 9 ఫిబ్రవరి:

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, తమిళ్ స్టార్ హీరో సూర్యలు కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. త‌మిళంలోసుధా కె ప్ర‌సాద్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి క‌ప్పం అనే టైటిల్ కూడా పెట్టేశారు.

ఇక ఇందులో మరో స్టార్ హీరో ఆర్య కూడా చేస్తున్నారు. ఐనులో మోహ‌న్ లాల్ ప్ర‌ధానమంత్రి పాత్ర పోషిస్తుండ‌గా, సూర్య ఆయ‌న‌కి ర‌క్ష‌కుడిగా ఉంటాడ‌ట‌. ఇక ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్స‌వ సందర్భంగా ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయ‌నున్నార‌ని తాజా స‌మాచారం.

అయితే చిత్రం దేశ‌భక్తి నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న‌ నేప‌థ్యంలో ఆ తేదీనా విడుద‌ల చేయాల‌ని నిర్మాతలు భావిస్తున్నార‌ట‌. ఇక సూర్య న‌టిస్తున్న మరో చిత్రం ఎన్‌జీకే త‌మిళ న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా విడుద‌ల కానుంది. ఈ చిత్ర టీజ‌ర్‌ని ఫిబ్ర‌వరి 14న విడుద‌ల చేయ‌నున్నారు.

మామాట: మొత్తానికి మల్టీస్టారర్ సినిమా అభిమానులని అలరించనుంది..

Leave a Reply