ప్రధాని మోడీతో మోహన్‌బాబు భేటీ…బీజేపీలోకి ఎంట్రీ ఖాయమేనా?

mohan-babu-to-enter-in-to-bjp-soon-delhi-sources
Share Icons:

ఢిల్లీ: ప్రధానమంత్రి మోడీతో టాలీవుడ్ సీనియర్ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు భేటీ అయ్యారు. కుమార్తె లక్ష్మీ ప్రసన్న, కొడుకు మంచు విష్ణులతో కలిసి పీఎంవోకు వెళ్లిన మోహన్ బాబు.. సుమారు అరగంటపాటు ప్రధానితో మంతనాలు జరిపారు. టాలీవుడ్ తోపాటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసిన మోహన్ బాబు అండ్ ఫ్యామిలీని బీజేపీలో చేరాలంటూ మోడీ ఆహ్వానించారు. ప్రధాని విన్నపానికి పాజిటివ్ గా స్పందించిన మంచు ఫ్యామిలీ కాషాయ కండువా కప్పుకోడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

అయితే మంచు ఫ్యామిలీ మోడీని కలవడం ఇదే తొలిసారి కాదు. మోదీ అత్యున్నత పదవిని చేపట్టిన తర్వాత వివిధ సందర్భాల్లో మోహన్ బాబు ఢిల్లీకి వెళ్లి కలిసోచ్చారు. కానీ ప్రస్తుతం వైసీపీలో ఉన్న మోహన్ బాబు మోడీని కలవడం పట్ల సర్వత్రా  ఆసక్తి నెలకొంది. ఆయన త్వరలోనే జగన్ కు షాక్ ఇచ్చే బీజేపీలో చేరే అవకాశముందని తెలుస్తోంది. కాగా, మోహన్ బాబు.. తెలుగు దేశం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఎన్డీఆర్ మరణం తర్వాత చంద్రబాబుతోనూ కొతకాలం సఖ్యతగా మెలిగారు. 1995 నుంచి 2001 వరకు టీడీపీ రాజ్యసభ ఎంపీగా పనిచేసిన ఆయన.. రెండో సారి అవకాశం దక్కకపోవడంతో హైకమాండ్ పై అలకవహించారు. క్రమంగా రాజకీయాల నుంచి కనుమరుగవుతోన్న సమయం లో.. విష్ణు ప్రేమ వివాహంతో మంచు ఫ్యామిలీ.. అప్పటి కాంగ్రెస్ సీఎం వైఎస్సార్ కు దగ్గరైంది. విష్ణు పెళ్లి చేసుకున్న వెరోనికా రెడ్డి.. వైఎస్ సోదరుడి కూతురు.

ఇక గతేడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో మంచు ఫ్యామిలీ అధికారికంగా వైసీపీలో చేరింది. జగన్ తరఫున వారు పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు. ఇక వైసీపీ అధికారంలోకి రావడం జగన్ సీఎం అవ్వడం జరిగిపోయాయి. అయితే వైసీపీ అధికారంలో ఉన్న మోహన్ బాబుకు ఎలాంటి పదవి రాలేదు. ఇలాంటి తరుణంలో ఆయన ప్రధానిని కలవడంతో బీజేపీలోకి వెళ్ళే అవకాశలున్నాయని తెలుస్తోంది.

 

Leave a Reply