ఎంపీ కవితకు మోదీ లేఖ… ఎందుకు?

ఎంపీ కవితకు మోదీ లేఖ… ఎందుకు?
Views:
23

న్యూఢిల్లీ మార్చి 13 :

దేశ ప్రధాన మంత్రి మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిట్ల వర్షం కురపిస్తుంటే ఆయన మాత్రం ఎంపీ కల్వకుంట్ల కవిత లేఖ రాసి మరీ అభినందనలు తెలిపారు. ఏమిటీ ట్విస్టు అనుకుంటున్నారా? మోదీ ఎందుకు లేఖ రాశారో మీరే చూడండి.

కేసీఆర్ కుమార్తె, టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు(మార్చి 13) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు లేఖ రాశారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. హిందీలోనో.. ఇంగ్లీషులోనో కాదు. తెలుగులో అచ్చు తెలుగులో రాశారు. లేఖ సారాంశం ఏమిటో తెలుసా?

డియర్ శ్రీమతి కల్వకుంట్ల,
‘మీ జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు స్వీకరించండి. దేశ ప్రజలకు మీరు సేవలందించేందుకు వీలుగా కావలసిన ఆరోగ్యకర, ఆనందమయ జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుతున్నాను.’

శుభాభినందనలతో నరేంద్ర మోడీ అని రాసిన ఉన్న ఎంపీ కవితకు పంపింది. ఈ లేఖపై ప్రధాని మోడీ సంతకం కూడా చేశారు. ప్రధాని రాసిన లేఖకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

మామాట : మోదీ విభిన్న, విలక్షణ నాయకుడు ఇదో తరహా ప్రచారం…

English Summary :

Prime minister Narendra Modi wrote a letter to KCR Daughter, MP K. Kavitha, He blessed her to long live and gave wishes to her for birthday.

(Visited 22 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: