అమెరికా-భారత్ మైత్రీలో కీలక ఘట్టం….

Share Icons:

ఢిల్లీ: అమెరికా-భారత్ మైత్రీ కీలక ఘట్టం చోటు చేసుకుంది. రక్షణ రంగంలో 3 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ… భారత్ పర్యటన తమకెంతో ప్రత్యేకమైనదని, తీవ్రవాదాన్ని అణిచివేసేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. తన పర్యటన రెండు దేశాలకు ఉపయోగకరమైనదని ట్రంప్ అన్నారు సహజవాయువు రంగంలో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం ఉంటుందని అన్నారు. భారత్‌తో ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని వివరించారు. రక్షణ రంగంలో 3 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరిందని… అపాచీ, రోమియో హెలికాప్టర్ల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. భారతీయుల ఆదరాభిమానాలు వెలకట్టలేనివని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని మోదీ తెలిపారు. భారత రక్షణ రంగానికి అత్యాధునిక ఆయుధాలు త్వరలో సమకూరనున్నాయన్నారు.  21వ శతాబ్దపు అమెరికా భారత్ మైత్రీ కీలక ఘట్టమన్నారు. గత 8 నెలల్లో ట్రంప్‌తో 8 సార్లు భేటీ అయ్యామన్నారు. సమాన అవకాశాలతో పాటు… స్వేచ్ఛాయుత వాణిజ్యంపై ఇరు దేశాలు చర్చించామన్నారు. ఇంధన సహకారంపై ప్రత్యేకంగా చర్చించామన్నారు. ట్రంప్ సతీ సమేతంగా భారత్‌కు రావడం ఆనందం కలిగించిందన్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో మూడువేల బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది.

అటు అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ రెండోరోజు మెరిసారు. ట్రంప్ పర్యటనలో భాగంగా సోమవారం ఎర్రని డ్రెస్సు వేసుకొని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక రెండో రోజు ఇవాంక ట్రంప్.. శ్వేత వర్ణ డ్రెస్సు వేసుకొని.. ఆ వస్త్రానికే అందం తీసుకొచ్చారు.

ఉదయం రాష్ట్రపతి భవన్ వద్దకు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ వెనకాల తన భర్త జరెద్ కుష్నర్‌తో కలిసి ఇవాంక వచ్చారు. ఈ సారి కాస్త డిఫరెంట్‌గా తెల్లని షెర్వాణీ ధరించారు. దీంతో ఆమెను మరోసారి ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. ఇండో వెస్ట్రన్ డిజైనర్ అనితా డొంగ్రే షెర్వానీని డిజైన్ చేశారు. ముర్షిదాబాద్ పట్టుతో తయారుచేసిన షెర్వానీని అందంగ డిజైన్ చేశారు. స్లివ్‌లెస్ కాకుండా నిండుగా.. భారతీయత ఉట్టిపడేట్టు అందులో ఇవాంక కనిపించారు. షెర్వానీని మెటాలిక్ బటన్లను పొందుపరిచారు. షెర్వానీ కింద కూడా స్ట్రెయిట్ ఫీట్ గల తెల్లని ప్యాంట్‌ను ఇవాంక ధరించారు. షెర్వానీ ధరించిన ఇవాకం వెంట్రుకలను వీరబోసుకొని కనిపించారు.

 

Leave a Reply