TRENDING NOW

టీడీపీ ఎంపీని పొగిడిన మోదీ…ఫైర్ అవుతున్న ఎంపీ…

టీడీపీ ఎంపీని పొగిడిన మోదీ…ఫైర్ అవుతున్న ఎంపీ…

చిత్తూరు, 14 ఫిబ్రవరి:

లోక్ సభ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ టీడీపీ ఎంపీ శివప్రసాద్ పై ప్రశంసలు కురింపించారు. శివప్రసాద్ చాలా మంచి నటుడని మోదీ కితాబిచ్చారు. చిత్రవిచిత్ర వేషధారణతో ఆయన పార్లమెంటులో అందరిని నవ్వించేవారని అన్నారు. తాను సభకు ఎన్ని టెన్షన్లతో వచ్చినా.. శివప్రసాద్ ను చూడగానే అన్నీ మరిచిపోతానని వ్యగ్యంగా  వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై శివప్రసాద్ తీవ్రంగా స్పందించారు. మోదీ తనకు అద్భుతమైన ప్రశంస ఇచ్చారని,  అందరిని ఎగతాళి చేసినట్లు కళ గురించి మాట్లాడలేకపోయాడని,  మోదీ ప్రశంస తనకు అవసరం లేదని చెప్పారు.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy
treefurn AD

ఆయన వ్యంగ్యంగా మాట్లాడినా.. ఎలా మాట్లాడినా తనకు ప్రశంస అవసరం లేదని, చంద్రబాబు పోరాటానికి మద్దతుగా హోదా కోసం తన వంతు కృషి చేశానని తెలిపారు. వేషధారణలో గిన్నిస్ రికార్డు తనకు అవసరం లేదని, ప్రజలకు మేలు జరిగి వారి ప్రేమ ఉంటే చాలని శివప్రసాద్‌ స్పష్టం చేశారు.

కాగా, ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు కోరుతూ శివ ప్రసాద్ రోజుకో వేషంతో ఇతర టీడీపీ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

మామాట: వ్యంగ్యస్త్రాలు సంధించడంలో ప్రధాని ధిట్టగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: