ఎన్నికలకు ముందు సంచలన నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వం….

Share Icons:

ఢిల్లీ, 7 జనవరి:

లోక్‌సభ ఎన్నికలకి ముందు మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో రిజర్వేషన్లు 50-60 శాతం వరకు పెంచడానికి సంబంధించిన రాజ్యంగ సవరణ బిల్లును రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. అయితే ఈ రిజర్వేషన్లు వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు,  అలాగే ఐదు ఎకరాల భూమి లోపు ఉన్నవారికి ఈ కోటా వర్తిస్తుందని తెలుస్తోంది.

కాగా, సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో మోదీ సర్కార్ చేసిన ప్రకటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కేబినెట్ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించింది. అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లును ఎన్నికల జిమ్మిక్కుగా అభివర్ణించింది. రిజర్వేషన్‌లు 50శాతం మించకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెబితే.. మరో 10శాతం ఎలా పెంచుతారని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ విమర్శించారు.

మామాట: అంతా ఎన్నికల జిమ్మిక్కులానే ఉంది…

Leave a Reply