మోదీకి సియోల్ శాంతి పురస్కారం

Modi awarded 2018 Seoul Peace Prize
Share Icons:

న్యూఢిల్లీ, 24 అక్టోబర్:

భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మక సియోల్ శాంతి పురస్కారం వరించింది. అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలను మెరుగుపరుచకోవడంతో పాటు ఆర్థిక వృద్ధి పెరుగుదలకు మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నారని అవార్డు కమిటీ చైర్మన్ క్వోన్ ఈ హైయోక్ తెలిపారు.

ఇక అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు నోట్ల రద్దు నిర్ణయం మోదీ తీసుకోవడం సాహసోపేతమైన నిర్ణయమని పేర్కొన్నారు. అలాగే గతంలో ఈ అవార్డును ఐరాస మాజీ సెక్రటరీలుగా వ్యవహరించిన జనరల్ కోఫీ అన్నన్, బాన్ కీ మూన్ లకు దక్కింది. ప్రతీ రెండు సంవత్సరాలకో సారి అందించే ఈ అవార్డును 2018 ఏడాదికి గానూ మోదీకి వరించింది.

కాగా, మోదీ నామిక్స్ ద్వారా దేశ ఆర్థిక పురోగతికి దోహదపడే నిర్ణయాలు తీసుకుంటున్న మోదీని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ వెల్లడించారు.

మామాట: అవును ప్రధాని అన్నీ సాహసోపేతమైన నిర్ణయాలే తీసుకుంటున్నారుగా…

Leave a Reply