మోదికి వ్యతిరేకంగా కాగడాల ప్రదర్శన-టీడీపీ

Modi,Against,Torch Display,ap,tdp,chandra babu
Share Icons:

అమరావతి, ఏప్రిల్ 05,

టిడిపి  నేతలపై కేంద్ర వ్యవస్థలతో మోది కావాలనే దాడులు చేయిస్తున్నారని ఏపి సియం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదని, వీరికి ప్రజలు ఓటుతోనే బుద్దిచెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.    కాగా, టిడిపి మేనిఫెస్టోను ఉగాది రోజున విడుదల చేయనున్నట్లు పార్టీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్‌ లో తెలిపారు.

తెలుగువారి పౌరుషానికి ప్రతీకగా శనివారం సాయంత్రం కాగడాల ప్రదర్శన నిర్వహించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఎలాంటి కుట్రలనైనా ఎదుర్కొంటామనే స్ఫూర్తితో, తెలుగుజాతి కీర్తిని చాటుతూ ఈ కాగడాల ప్రదర్శన సాగాలన్నారు. అలాగే, ఈ నెల 7న రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రార్ధనలు, పూజలు నిర్వహించాలని, కేంద్రం కుట్రలకు వ్యతిరేకంగా సర్వమత నేతలు తమకు అండగా నిలుస్తారని సియం ఆకాంక్షించారు.

జగన్‌ తమతోనే ఉంటాడని బిజెపి నేతలు చెప్పడం ముస్లిం మైనార్టీల్లో తీవ్ర ఆగ్రహాన్ని పెంచిందని సియం అన్నారు. 8,9 తేదీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి వీర తిలకం దిద్ది పౌరుషాన్ని రగిలింపచేయాలని సియం సూచించారు. ఇక కేసీఆర్ పొలవరం అడ్డుకునేందుకు న్యాయస్థానంలో కేసులు వేశారని వీటన్నింటినీ ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని సియం చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు.

 

మామాట: ఎలాగో మంట రాజీస్తూ ఉండాలి పనయ్యేవరకూ

Leave a Reply