TRENDING NOW

వైసీపీ ఎమ్మెల్సీ ఖరారు..టీడీపీలో ఎవరికి దక్కుతాయో…

వైసీపీ ఎమ్మెల్సీ ఖరారు..టీడీపీలో ఎవరికి దక్కుతాయో…

అమరావతి, 21 ఫిబ్రవరి:

ఏపీ శాసనమండలిలో  ఎమ్మెల్యే కోటాలో ఖాళీలు ఉన్న 5 స్థానాలకి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 28 కాగా  మార్చి 1న నామినేషన్ల పరిశీలన, మార్చి 5న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నోటిఫికేషన్ లో పేర్కొంది. అలాగే మార్చి 12న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిపి విజేతను కూడా ప్రకటించనున్నారు.

ఇక అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి ఇందులో నాలుగు టీడీపీ, ఒకటి వైసీపీ గెలుచుకోవడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తమ శాసనమండలి అభ్యర్థిగా జంగా కృష్ణామూర్తిని వైసీపీ ప్రకటించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జంగా కృష్ణమూర్తికి బీ ఫారం అందజేశారు. 

treefurn AD
Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

అయితే టీడీపీ.. తమ దక్కనున్న 4 గురు అభ్యర్ధులని ప్రకటించే పనిలో ఉంది. ఇక ఈ పదవులని దక్కించుకునేందుకు చాలామంది ఆశావాహులు క్యూలో ఉన్నారు. అయితే ఇందులో ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులకి రిటైర్ అవుతున్న నలుగురిలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి మళ్ళీ పదవి దక్కొచ్చు. అలాగే మరో మంత్రి నారాయణ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనుండడంతో ఆయనకు అవకాశం లేదు. రిటైరవుతున్న టీడీపీ ఎమ్మెల్సీల్లో శమంతకమణి, ఆదిరెడ్డి అప్పారావులకు కొనసాగింపు ఉండకపోవచ్చని అంటున్నారు.

అయితే ఇటీవల టీడీపీలో చేరిన ఘట్టమనేని ఆదిశేషగిరి రావుకి, ఏపీ ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబులకు ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉంది.

అటు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరితే ఆయనకు కూడా పదవి దక్కొచ్చు.

మరోవైపు గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఉన్న రామసుబ్బారెడ్డి, సోమిరెడ్డి కొద్ది రోజుల క్రితం రాజీనామా చేశారు. అయితే ఈ ఖాళీల భర్తీపై ఇంకా నోటిఫికేషన్‌ రాలేదు. కానీ…నోటిఫికేషన్  వస్తే రామసుబ్బారెడ్డి స్థానంలో మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడి కొడుకు సుబ్బరామిరెడ్డికి, సోమిరెడ్డి స్థానంలో నెల్లూరు మేయర్‌ అజీజ్‌కు చాన్సు రావచ్చని అంటున్నారు.

మామాట: టీడీపీలో ఎమ్మెల్సీ దక్కించుకునేదెవరో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: