నలుగురు సిట్టింగ్‌లకి టికెట్ కన్ఫామ్ అయింది..

Share Icons:

అమరావతి, 26 ఫిబ్రవరి:

రోజుకు ఒక పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజవర్గాల్లో అభ్యర్ధులని ప్రకటిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు…తాజాగా ప్ర‌కాశం జిల్లాకు సంబంధించిన 4 నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఖరారు చేశారు. ప్రస్తుతం సిట్టింగులుగా ఉన్న ఎమ్మెల్యేల‌నే చంద్ర‌బాబు ఎంపిక చేశారు.

దర్శి నుండి మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు, ఒంగోలు నుండి దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌, కొండ‌పి నుండి డోలా బాలా వీరాంజ‌నేయ‌స్వామి, గిద్ద‌లూరు ముత‌ముల అశోక్ రెడ్డిల‌కు చంద్ర‌బాబు టికెట్లు క‌న్ఫ‌ర్మ్ చేశారు.

అయితే, ఈ సంద‌ర్భంగానే చంద్ర‌బాబు ఆయా నాయ‌కుల‌కు భారీ టార్గెట్ ముందుంచారు. ప్ర‌తి ఒక్క‌రూ తిరిగి ఎన్నిక కావ‌డంతోపాటు టీడీపీకి భారీ మెజారిటీని తీసుకు రావాల‌ని దిశానిర్దేశం చేశారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కి స‌ర్వే ఆధారంగా టికెట్ కేటాయిస్తున్నారు. వారు ప్రజలతో ఎలా ఉంటున్నారు.. వారి స‌మ‌స్య‌ల‌ను ఏ విధంగా ప‌రిష్క‌రిస్తున్నారు? ప‌్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లారా? లేదా? అనే అంశాల‌ను సీఎం చంద్ర‌బాబు లోతుగా ప‌రిశీలించి అభ్యర్ధులకి టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

మామాట: మొత్తానికి ఒక ఆర్డర్‌లో వెళుతున్నారు…

Leave a Reply